Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ సినిమాలు చెప్పిన టైంకి రావని మరోసారి ఫౌజీతో ఫ్రూవ్ అయ్యింది. డిసెంబర్ బరిలో రావాల్సిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ నెక్ట్స్ ఇయర్‌కు పోస్ట్ పోన్ అవుతోంది. డార్లింగ్ డేట్స్ ఇవ్వడు.. ఇచ్చినా రాకపోవడం వల్ల ఏడాదిలో పూర్తికావాల్సిన సినిమాలు.. రెండు, మూడేళ్లు తీసేసుకుంటున్నాయి. ఫౌజీ విషయంలోనూ ఇదే జరిగింది. అక్టోబర్ నాటికి షూట్ కంప్లీట్ కావాల్సి ఉండగా.. ఇంకా కొంత పోర్షన్ పెండింగ్‌లో ఉందని తెలుస్తోంది.
ఫౌజీలో యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నాడు డైరెక్టర్ హను రాఘవపూడి. ప్రజెంట్ ఇంటర్వెల్లో వచ్చే టెంపుల్ ఫైట్ చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని టాక్. అలాగే క్లైమాక్స్ షూట్ చేస్తారట. ఓవరాల్‌గా డిసెంబర్ ఎండింగ్ నాటికి ఫౌజీ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేయాలని అనుకుంటున్నారు మేకర్స్. ఈ మంత్ అక్టోబర్ 23న డార్లింగ్ బర్త్ డే సందర్భంగా ఫౌజీకి నుండి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారట. నెక్ట్స్ ఇయర్ మార్చిలో ఫౌజీని రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కన స్పిరిట్ కూడా వాయిదా పడబోతున్నట్లే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న స్పిరిట్ మార్చి 5న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. అదే డేట్‌కు సినిమా తెచ్చేయాలని సందీప్ ప్లాన్ చేసుకుంటే ఏం లాభం.. డైనమిక్ డైరెక్టర్‌కు కూడా డేట్స్ ఇవ్వట్లేదు డార్లింగ్. ఈ మూవీ షూటింగ్ స్టార్టై దాదాపు ఏడాది కావొస్తున్నా.. 40 శాతమే షూటింగ్ ఫినీష్ అయ్యింది. ప్రస్తుతం ఫౌజీని ఫినీష్ చేసే పనిలో బిజీగా ఉన్న డార్లింగ్.. నెక్ట్స్ స్పిరిట్‌కు డేట్స్ కేటాయిస్తాడు. షూటింగ్ 2027 సెకండాఫ్‌లో పూర్తి చేయాలనుకుంటున్నాడట సందీప్ రెడ్డి వంగా. డిసెంబర్ బరిలో మూవీ రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ లెక్కన ఏడాదికి రెండు సినిమాలు తీసుకొచ్చాస్తానని డార్లింగ్ చెబుతోన్న మాటలు.. నీటి మూటలేనా..? చెప్పిన టైంకే రెబల్ స్టార్ సినిమా వస్తుందంటే.. నమ్మలేని పరిస్థితికి ఫ్యాన్స్ వచ్చేశారా..?
Also Read
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!