Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cockroach Control Tips: ఇంటిని, ముఖ్యంగా వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. చాలామంది ఇళ్లలో వంటగది సింక్, వాష్ బేసిన్ లేదా కప్బోర్డులలో బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో దొరికే రకరకాల మందులు, స్ప్రేలు వాడినా కొన్నిసార్లు ఫలితం తాత్కాలికంగానే ఉంటుంది. మన వంటింట్లో లభించే సహజసిద్ధమైన వస్తువులతో బొద్దింకలను శాశ్వతంగా ఎలా తరిమికొట్టవచ్చో ఇప్పడు తెలుసుకుందాం.
దోసకాయ ముక్కలు లేదా తొక్కలు
దోసకాయ వాసన బొద్దింకలకు అస్సలు పడదు. దోసకాయ తొక్కలను లేదా ముక్కలను ఎండబెట్టి, బొద్దింకలు ఎక్కువగా తిరిగే కప్‌బోర్డులు, మూలలు లేదా డ్రైనేజీ ప్రాంతాల వద్ద ఉంచాలి. ఆ ఘాటైన వాసనకి బొద్దింకలు ఆ ప్రదేశాల్లోకి రాకుండా దూరంగా పారిపోతాయి.
Also Read
- International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
- Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
- Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
- Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
బేకింగ్ సోడా & చక్కెర మిశ్రమం
బొద్దింకలను వదిలించుకోవడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన చిట్కా. బేకింగ్ సోడాలో కొద్దిగా పంచదార కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశాలలో చల్లాలి. పంచదార తీపి వాసనకు ఆకర్షితులై బొద్దింకలు దీనిని తింటాయి. బేకింగ్ సోడా వల్ల వాటి కడుపులో గ్యాస్ ఏర్పడి అవి నశిస్తాయి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల బొద్దింకల సంతతి పూర్తిగా తగ్గుతుంది.
బిర్యానీ ఆకుల పొడి
బిర్యానీ ఆకులకు ఉండే సహజమైన ఘాటు బొద్దింకలకు ప్రతికూలమైనది. బిర్యానీ ఆకులను మెత్తగా పొడి చేసి, సింక్ కింద లేదా బొద్దింకలు ఎక్కువగా సంచరించే మూలల్లో చల్లాలి. ఈ వాసన ప్రభావానికి బొద్దింకలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోతాయి.
సింక్, వాష్ బేసిన్ పైపుల శుభ్రత
చాలావరకు బొద్దింకలు సింక్ పైపులు, డ్రైనేజీ రంధ్రాల గుండా ఇంట్లోకి ప్రవేశిస్తాయి. బకెట్ నీళ్లలో కొద్దిగా అమోనియం కలిపి రాత్రి పడుకునే ముందు కిచెన్ సింక్, వాష్ బేసిన్ డ్రెయిన్లలో పోయాలి. దీని ఘాటైన వాసనకి పైపుల్లో ఉన్న బొద్దింకలు పైకి రాకుండా అక్కడికక్కడే నశిస్తాయి.
బోరిక్ పౌడర్
బోరిక్ పౌడర్ బొద్దింకలను నివారించడంలో చాలా బాగా పనిచేస్తుంది. బోరిక్ పౌడర్‌లో కొద్దిగా పంచదార పొడి కలిపి మూలల్లో చల్లడం ద్వారా బొద్దింకలను సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే బోరిక్ పౌడర్, గోధుమపిండి, కొద్దిగా పంచదార కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి కప్‌బోర్డులు, అల్మారాల కింద ఉంచితే బొద్దింకలు వాటిని తిని నాశనమవుతాయి.
నిమ్మ తొక్కలు, ఉల్లిపాయ, లవంగాల మిశ్రమం
ఎండబెట్టిన నిమ్మకాయ తొక్కలు వార్డ్‌రోబ్‌లలో ఉంచితే బొద్దింకల తాకిడి తగ్గుతుంది. అలాగే ఉల్లిపాయ పేస్ట్‌లో కొన్ని లవంగాలు లేదా లవంగాల పొడి కలిపి బొద్దింకలు చేరే ప్రాంతాలలో ఉంచడం వల్ల, ఆ ఘాటైన వాసనకు బొద్దింకలు గుడ్లు పెట్టకుండా, అక్కడ నివాసం ఏర్పరచుకోకుండా పారిపోతాయి.
ఈ సహజ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే ఖరీదైన కెమికల్స్ వాడకుండానే వంటింట్లో బొద్దింకల సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
తాజావార్తలు
-
Hyundai Creta 2027: క్రెటా ప్రియులకు గుడ్ న్యూస్.. అదరగొడుతున్న నెక్స్ట్-జెన్ క్రెటా.. ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Cyclone Murasu: తీరం దాటిన మురసు తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు!
-
Graduate MLC: మీరు ఇంకా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేదా..? CEO సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన..
-
Smartphones: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, 100W ఛార్జింగ్.. తక్కువ ధరల్లో మార్కెట్లోకి..
-
Driving License: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మరింత సులువు.. ఇంటి నుంచే పరీక్ష..
ట్రెండింగ్
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!