APL 2025: విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2025 ఫైనల్‌లో అమరావతి రాయల్స్, తుంగభద్ర వారియర్స్ జట్లు విజేత నువ్వా.. నేనా.. అన్నట్లుగా మ్యాచ్ అమాంతం సాగింది. ఇకపోతే టీమిండియా ప్లేయర్ అమరావతి రాయల్స్ కెప్టెన్ హనుమ విహారి బ్యాట్, బంతితో అద్భుతంగా రాణించినా.. చివరికి విజయం మాత్రం తుంగభద్ర వారియర్స్ ను చేరుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన…
APL 2025 Auction Teams and Players Price: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2025 వేలం విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో సోమవారం జరిగింది. వేలంలో ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, ఏసీఏ ఉపాధ్యక్షుడు పివిఆర్ ప్రశాంత్, గ్రౌండ్ డెవలప్‌మెంట్ జీఎం ఎంఎస్ కుమార్, కౌన్సిలర్ దంతు విష్ణు తేజ్ సహా ఏడు జట్ల యాజమానులు పాల్గొన్నారు. వేలంలో విశాఖకు చెందిన పైలా అవినాష్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. రాయల్స్ ఆఫ్…
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలకు క్రీడాకారులకు కూడా బలైపోతున్నారని దుయ్యబట్టారు. అందుకు నిదర్శనం హనుమ విహారినేనని అన్నారు. ప్రతిభ, సామర్థ్యాలున్న హనుమ విహారిని కాదని, వైసీపీ నాయకుడి కోసం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పని చేయడం క్రీడాలోకానికే అవమానం అని పేర్కొన్నారు. శరత్ చంద్రారెడ్డి నేతృత్వంలో ఏపీ క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రతిష్ట మసక బారిందని వ్యాఖ్యానించారు. దోపిడీకి ఆలవాలంగా మారిందని పేర్కొన్నారు.
టీడీపీలో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే.. తొలి జాబితాలోనే టిక్కెట్ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరారు. విజయవాడలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన పార్థసారథి.. గతంలోనే టీడీపీ చేరతానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి జాబితాలో తనకు టిక్కెట్ ఇవ్వడం ఆనందంగా ఉందని పార్థసారథి అన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారం నూజివీడు వెళ్తున్నానని తెలిపారు. మరోవైపు.. కోటి 30 లక్షల…
ఆంధ్ర రంజీ జట్టుకు భారత టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి గుడ్ బై చెప్పారు. భవిష్యత్లో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడబోనని వెల్లడించాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లలో ఆవేదన వెళ్లగక్కాడు. క్రికెట్‌లో ఏపీ రాజకీయ నేత జోక్యం ఉందని మనస్తాపం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో విహారి పోస్టు చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో క్రీడాకారుల కన్నా.. రాజకీయాలకే ప్రాధాన్యత ఎక్కువ ఉందని వెల్లడించారు.
టీమిండియా నుంచి నన్నెందుకు తప్పించారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అని క్రికెటర్ హనుమ విహారి అన్నారు. టీమిండియాలో స్థానం లేనందుకు ఎంత నిరాశ చెందానో.. జట్టు నుంచి ఎందుకు తొలగించారు అనే కారణం తెలియక అంతకంటే ఎక్కువగానే బాధపడుతున్నానని అతడు చెప్పాడు. ఈ విషయం గురించి మేనేజ్‌మెంట్ నుంచి నన్నెవరూ సంప్రదించలేదు అతని పేర్కొన్నారు.
Hanuma Vihari Said I Did not find a reason why I was dropped from India Team: భారత జట్టు నుంచి తనను ఎందుకు తప్పించారో ఇప్పటికీ అర్థమవడం లేదని టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, తెలుగు తేజం హనుమ విహారి అన్నాడు. తన ఉత్తమ ప్రదర్శన జట్టుకు సరిపోలేదేమో అని, అయినా టీంలో చోటు కోసం మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటా అని విహారి తెలిపాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీ 2023 ఆడుతున్న విహారి..…