Project K: ప్రభాస్ ఫ్యాన్స్ కు చేదు వార్త.. ప్రాజెక్ట్ కె వాయిదా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Project K: ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒకేఒక్క పేరు ప్రాజెక్ట్ కె. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీ దత్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి రిలీజైన ప్రీ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రాజెక్ట్ కె అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని.. ఒరిజినల్ టైటిల్, టీజర్, రిలీజ్ డేట్ ను జూలై 20 న కాలిపోర్నియాలో జరుగుతున్న శాన్ డియాగో కామిక్-కాన్ వేడుకలో రిలీజ్ చేయనున్నారు. అయితే ముందు నుంచి ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారని తెలిసిందే.
Breaking: దళపతి విజయ్ పాదయాత్ర.. ఎక్కడనుంచి అంటే ?
Also Read
- Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్!
- Allu Aravind 1 Crore Challenge: ఆ సినిమా విషయంలో సుకుమార్‌కి అల్లు అరవింద్ రూ.కోటి ఛాలెంజ్... వైరల్ అవుతున్న చెక్!
- Alias Rukmini రిలీజ్‌కు ముందే రిజల్ట్ చెప్పేసిన దిల్ రాజు!
- Nani: ‘ది ప్యారడైజ్’ రిజల్ట్‌తో నాని హ్యాపీగానే ఉన్నారా? క్లారిటీ ఇచ్చిన సోదరి దీప్తి గంటా!
ఇకపోతే అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా వచ్చే అవకాశాలు లేవని వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదట. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతుంది. అందుకు తగ్గట్టుగానే గ్రాఫిక్స్ ఉండనున్నాయట. ఇప్పటికే సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో.. గ్రాఫిక్స్ పై మేకర్స్ ఫోకస్ చేశారట. దీంతో అన్ని పర్ఫెక్ట్ గా చేయడానికి నాగ అశ్విన్ బాగా కష్టపడుతున్నాడట. అందుకే కొద్దిగా ఆలస్యమైనా పర్లేదని నాగీ.. ప్రాజెక్ట్ కె ను ఒక శిల్పంలా చెక్కుతున్నాడని టాక్ నడుస్తోంది. ఇక ఇదే కనుక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది ఖచ్చితంగా చేదువార్తే అని చెప్పాలి. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Senior Heroines: టాలీవుడ్‌కు దూరమైన స్టార్ హీరోయిన్లు.. అనుష్క నుంచి తమన్నా ఇప్పుడు ఏం చేస్తున్నారు?
-
AP Panchayat Elections 2026: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు.. కత్తులు, వేట కొడవళ్లతో దాడులు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్‌కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!
ట్రెండింగ్
-
IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!