టీమిండియా హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. గంభీర్ హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాక ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్ 2025లను భారత జట్టు గెలుచుకుంది. కుర్రాళ్లతో కూడిన జట్టుతో ఇంగ్లాండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌ను సైతం డ్రాగా ముగించాడు. అయితే కోచ్‌గా వచ్చిన కొత్తలో గౌతీ వరుస పరాజయాలు చవిచూశాడు. అందులో ముఖ్యమైంది ఏంటంటే… భారత గడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను ఓడిపోవడం. ఈ సిరీస్ ఫలితంపై గంభీర్…
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఆటగాడు సాయి సుదర్శన్ మెరిశాడు. మొదటి రోజు బ్యాటింగ్‌లో (87) అదరగొట్టిన సాయి.. రెండో రోజు ఫీల్డింగ్‌లో ఔరా అనిపించాడు. స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన 7వ ఓవర్లోని రెండో బంతిని విండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ షాట్ ఆడగా.. ఫార్వర్డ్ షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సాయి ఊహించని రీతిలో క్యాచ్ అందుకున్నాడు. బంతి వేగంగా దూసుకురాగా.. ముందుగా సాయి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే…
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (173; 253 బంతుల్లో 22 ఫోర్లు) భారీ సెంచరీతో చెలరేగాడు. యశస్వితో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (20) క్రీజులో ఉన్నాడు. సాయి సుదర్శన్ (87) హాఫ్ సెంచరీ చేయగా.. కేఎల్ రాహుల్…
IND vs WI Test: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా జరుగుతున్న భారత్, వెస్టిండీస్ రెండో టెస్ట్ మ్యాచ్ నేడు (అక్టోబర్ 10) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమైంది. తొలి టెస్ట్‌ను ఘనంగా గెలిచిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా, ఈ మ్యాచ్‌లోనూ అదే ఉత్సాహంతో ఆడేందుకు సిద్ధమైంది. ఇక రెండో టెస్ట్ టాస్‌లో అదృష్టం టీమిండియాకే దక్కింది. గిల్ తన కెప్టెన్సీలో తొలి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక…
IND vs WI Test: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా, టీమిండియా ప్రస్తుతం రెండో టెస్ట్ కోసం దేశ రాజధాని న్యూఢిల్లీలోకి చేరుకుంది. అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌ను కేవలం రెండున్నర రోజుల్లోనే ఇన్నింగ్స్ తేడాతో ముగించిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు, నేటి (అక్టోబర్ 10) నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో అంచనాలకు అనుగుణంగా సులభ విజయం…
IND vs WI: అహ్మదాబాద్‌లో జరుగుతున్న భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌లో కరీబియన్ జట్టు భారీ ఒత్తిడిని ఎదుర్కొవడంతో టీమిండియా బౌలర్ల దెబ్బకి కుప్పకూలింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ, భారత బౌలర్లకు ఎదురొడ్డి నిలవలేక 44.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది. వెస్టిండీస్ జట్టు ఆరంభం నుంచే వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ట్యాగెనరైన్ చాందర్‌పాల్ డక్ అవుట్ కాగా.. జాన్ కాంప్‌బెల్ (8) త్వరగానే పెవిలియన్ చేరారు. మధ్యలో…
IND vs WI: అహ్మదాబాద్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ పిచ్ మంచిగా ఉందని, ఇందులో తేమ ఎక్కువగా ఉన్నప్పటికీ తమ ఆటగాళ్లు బాగానే ఆడతారని చేజ్ పేర్కొన్నాడు. డబ్ల్యూటీసీలో పాయింట్లు సాధించడం తమ లక్ష్యమని, ఈ పిచ్‌పై చివరిగా బ్యాటింగ్ చేయాలనుకోవడం లేదని తెలిపాడు. ఇక వెస్టిండీస్ తరపున ఖారీ పియెర్, జోహాన్ లేన్ అరంగేట్రం…
Team India Schedule: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025 సంవత్సరానికి భారత పురుషుల క్రికెట్ జట్టు భారతదేశంలో జరిగే మ్యాచ్ లను అధికారికంగా ప్రకటించింది. ఈ సీజన్లో భారత జట్టు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లతో టెస్ట్, వన్డే, టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో తలపడనుంది. అక్టోబర్ నెలలో వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌తో ప్రారంభం కానుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో అన్ని ఫార్మాట్లలో మ్యాచ్‌లు జరగనున్నాయి. Read Also: RCB vs GT: జోరుమీదున్న బెంగళూరును…
IND Women vs WI Women: టీమిండియా, వెస్టిండీస్ మహిళల మధ్య వడోదరలో జరిగిన వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడించి, సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బౌలింగ్ చేసిన భారత జట్టు, వెస్టిండీస్‌ను కేవలం 162 పరుగులకే కట్టడి చేసింది. ఆ తరువాత, భారత బ్యాట్స్‌మెన్ ఈ సులభమైన లక్ష్యాన్ని కేవలం 28.2 ఓవర్లలో ఛేదించారు. దీప్తి శర్మ ఈ మ్యాచ్‌లో అటు బౌలింగ్ లో,…
IND W vs WI W: వెస్టిండీస్‌తో జరిగిన మూడో మరియు చివరి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 217 పరుగులు చేసింది. దీంతో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20…