EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EPFO Update: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ సబ్స్క్రైబర్లకు ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చింది. పన్ను సంవత్సరం (Tax Year) 2026-27 నుంచి పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునేటప్పుడు టీడీఎస్ మినహాయింపు కోసం ఉపయోగించే ఫారమ్ 15G, ఫారమ్ 15Hలు ఇకపై చెల్లవని స్పష్టం చేసింది. వీటి స్థానంలో ఇన్కమ్ టాక్స్ యాక్ట్, 2025 ప్రకారం టీడీఎస్ మినహాయింపు క్లెయిమ్ చేసుకోవడానికి ఇకపై ఫారమ్ 121 సమర్పించడం తప్పనిసరి అని వెల్లడించింది. ఈ విషయాన్ని ఇపిఎఫ్ఓ తన అధికారిక ‘X’ (ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకుంది. ఇప్పటివరకు పీఎఫ్ నుంచి డబ్బులు తీసే సమయంలో పన్ను మినహాయింపు కోసం నివాస పన్ను చెల్లింపుదారులు తమ వయస్సు, అర్హతను బట్టి ఫారమ్ 15G లేదా 15Hలలో ఒకదాన్ని ఎంచుకునేవారు. సాధారణంగా 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండి, వారి మొత్తం అంచనా ఆదాయం పన్ను పరిమితి కంటే తక్కువగా ఉన్నవారు ఫారమ్ 15Gని వాడేవారు. అదే 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు ఫారమ్ 15H ద్వారా మినహాయింపు పొందేవారు. అయితే పన్ను సంవత్సరం 2026-27 నుంచి ఈ రెండు ఫారమ్‌లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది.
ఈ రెండు వేర్వేరు ఫారమ్‌ల స్థానంలో ఒకే ఒక్క ఫారమ్ 121ని అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది తప్ప, దీనివల్ల కొత్తగా ఎలాంటి పన్ను భారం పడదు. సబ్స్క్రైబర్లు ఏ ఫారమ్ ఎంచుకోవాలనే అయోమయం లేకుండా సులువుగా మినహాయింపు పొందేందుకు ఇది సహాయపడుతుంది. అయితే ఈ ఫారమ్ 121 సమర్పించినంత మాత్రాన మీరు డ్రా చేసే పీఎఫ్ సొమ్ము ఆటోమేటిక్‌గా పన్ను రహితం (Tax-Free) అయిపోదు. ఆ సంవత్సరంలో తమ అంచనా మొత్తం ఆదాయం పన్ను పరిధిలోకి రాని అర్హులైన వ్యక్తులు మాత్రమే తమ పీఎఫ్ డబ్బుల నుంచి TDS కట్ చేయవద్దని అభ్యర్థించడానికి ఈ ఫారమ్ ఉపయోగపడుతుంది. పన్ను పరిధిలోకి వచ్చేవారికి ఇది వర్తించదు. అంతేకాకుండా, ఈ మినహాయింపు క్లెయిమ్ చేయడానికి ఇపిఎఫ్ఓ నిబంధనల ప్రకారం చెల్లుబాటు అయ్యే పాన్ (PAN) కార్డ్ కలిగి ఉండటం తప్పనిసరి.
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!