ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాడ్వాయి మండలం బిరెల్లిలో దహన సంస్కారానికి వెళ్లి చెరువులో దిగి మంకిడి పవన్ అనే యువకుడు గల్లంతయ్యాడు. గ్రామంలో రామకృష్ణ అనే వ్యక్తి చనిపోగా అతని అంతిమయాత్రలో పాల్గొని దహన సంస్కారం అనంతరం స్నేహితులతో కలిసి పవన్ అనే యువకుడు చెరువులోకి దిగాడు. అయితే నవీన్, వినయ్, రణధీర్, అనే నలుగురు స్నేహితులు అవతల ఒడ్డుకు చేరుకున్నరు. కానీ, పవన్ మాత్రం నీటిలో మునిగి గల్లంతయ్యాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం…
చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ విషాద ఘటన జరిగింది.. గంగవరం మండలం చిన్నమనాయనిపల్లి గణేష్ నిమజ్జన సమయంలో చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు.. కాకర్లకుంట చెరువులో ఈ ఘటన జరిగింది.. మృతులు అదే గ్రామానికి చెందిన 27 ఏళ్ల భార్గవ్, 26 సంవత్సరాల చరణ్ గా గుర్తించారు పోలీసులు.
వినాయక చవితి రోజు బాపట్ల జిల్లాలో విషాద ఘటన జరిగింది.. తామర పూల కోసం వెళ్లి చెరువులో పడి ఇద్దరు బాలురు ప్రాణాలు విడిచారు.. ఈ ఘటనలో బాపట్ల జిల్లాలోని పూండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు మృతిచెందారు.. వినాయక చవితి పర్వదినం సందర్భంగా.. తామర పూల కోసం చెరువులోకి దిగారు ఇద్దరు బాలురు.. మృతులు పూండ్ల గ్రామానికి చెందిన 17 ఏళ్ల సైకం నాగభూషణం, 15 ఏళ్ల సుద్దపల్లి శ్రీమంత్ గా గుర్తించారు.
నీటికుంటలో పడి ఆరుగురు స్కూల్ విద్యార్థులు మృతి చెందారు. ఆస్పరి మండలం చిగిలిలో ఈ ఘటన విషాదాన్ని నింపింది.. స్కూల్ కి వెళ్లిన విద్యార్థులు స్కూల్ వదిలిన తరువాత సమీపంలో నీటి కుంటకు ఆడుకునేందుకు వెళ్లారు.. నీటికుంటలో ఆడుకుంటూ జారిపడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు. మృతులు శశికుమార్, కిన్నెరసాయి, సాయి కిరణ్, భీమ, వీరేంద్ర, మహబూబ్ గా గుర్తించారు.
నీటి కుంటలో మునిగి నలుగురు మృతి చెందిన విషాద ఘటన అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. మొలకలచెరువు మండల కేంద్రానికి చెందిన మల్లేష్ (36), అతని కుమార్తె లావణ్య (12), కుమారుడు నందకిషోర్ (10) కలిసి గ్రామ సమీపంలోని పెద్ద చెరువుకు బట్టలు ఉతికేందుకు వెళ్లారు.. ఈ క్రమంలో ఈత కొట్టేందుకు వెళ్లి చెరువులోకి దిగిన నందకిషోర్, అతని స్నేహితురాలు నందిని నీటిలో మునిగిపోతుండగా.. అది చూసిన లావణ్య పెద్దగా కేకలు వేసింది. అంతేకాదు..
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం మాదాలవారి గూడెంలో విషాదం చోటు చేసుకుంది. లింగయాస్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు పక్కనే ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లి గల్లంతు అయ్యారు. మొత్తం ఏడుగురు బీటెక్ ఫైనలియర్ విద్యార్థులు చెరువులోకి సరదాగా స్నానానికి వెళ్లారు. సెల్ఫీల మోజులో పడి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో పాలడుగు దుర్గారావు, జే. వెంకటేష్ గా గుర్తించారు. మరో ఐదుగురు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.
వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద రామన్న చెరువు కట్ట తెగింది. దీంతో.. 216వ నంబర్ ఒంగోలు, దిగమర్రు జాతీయ రహదారి పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. జాతీయ రహదారిపై దాదాపు అర కిలోమీటర్ మేర.. రోడ్డుపై దాదాపు మూడు అడుగుల వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో.. జాతీయ రహదారిపై వెళ్ళే వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. నాగౌర్ జిల్లా ఖిన్వ్‌సర్ ప్రాంతంలోని చరదా గ్రామంలో కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. చెరువులో మునిగి ఒక వివాహిత.. ఆమె ఇద్దరు కూతుళ్లు మృతి చెందారు. సమాచారం అందుకున్న భవంద పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను వెలికితీసి ఖిన్వసర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకు తరలించారు. మృతులు తల్లి లీల, కూతుళ్లు కనిక, కృష్ణగా గుర్తించారు. అయితే.. లీలా భర్త తనను కొట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
West Bengal : పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో చెరువులోకి ప్రవేశించిన 11 అడుగుల ఆడ మొసలిని చూసి ప్రజల్లో భయం నెలకొంది. మొసలిని చూసిన గ్రామ ప్రజలు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
పశ్చిమ బెంగాల్‌లో హింస చెలరేగింది. శనివారం జరుగుతున్న లోక్‌సభ చివరి దశ ఎన్నికల్లో వివిధ ప్రాంతాల నుండి చెదురుమదురు హింసాత్మక ఘటనలు మళ్లీ వెలువడుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణ 24 పరగణాల జిల్లా జయనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కుల్తాలి ప్రాంతంలో ఓ ఘటన వెలుగు చూసింది. ఇక్కడి పోలింగ్ బూత్‌లో ఉదయం ఓటింగ్ ప్రారంభమైన తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉన్న కొందరు వ్యక్తులు.. స్థానిక ప్రజలను ఓటింగ్ చేయకుండా నిలిపివేశారని ఆరోపించారు. దీనికి…