ఒకవైపు భారీ వర్షాలు, సీజనల్ జ్వరాలు తెలంగాణను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 658 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.తెలంగాణలో సోమవారం 540 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. వైద్యశాఖ మాత్రం నిర్లక్ష్యం కూడదంటోంది. జాగ్రత్తలు పాటించాలని సలహా ఇస్తోంది. కోవిడ్ కేసులు పెరుగుతున్నా మరణాలు అదుపులో వుండడం ఊరట కలిగించే అంశంగా చెప్పాలి.
Boyfriend Cheating: ప్రేమ, పెళ్లి, అరెస్ట్.. చివర్లో ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్
కొత్తగా నమోదయిన కోవిడ్ కేసులలో 316 కేసులు హైదరాబాద్ లోనే వున్నాయి. 52 కేసులు రంగారెడ్డి జిల్లా, 41 కేసులు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లానుంచి నమోదయ్యాయి. 4511 మంది ఐసోలేషన్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో జ్వరాలు టెన్షన్ పెడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో నీరు నిల్వ వున్న చోటు అంటువ్యాధులు ప్రబలకుండా యాక్షన్ ప్లాన్ రూపొందించింది వైద్యశాఖ, పంచాయతీ రాజ్ శాఖ. జియోగ్రాఫికల్ ఆధారంగా వరద ప్రభావిత ప్రాంతాలను నాలుగు భాగాలుగా విభజించారు.
ప్రతి ఇంటా ఫీవర్ సర్వే నిర్వహించనున్నారు. మలేరియా, డెంగ్యూ, చికన్ గున్యా ప్రబలకుండా నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహిస్తారు. 297 హై రిస్క్ ఏరియాలను గుర్తించారు వైద్యారోగ్యశాఖ అధికారులు. వరద ప్రభావిత ప్రాంతాలకు 670 మంది అదనపు వైద్య సిబ్బందిని తరలిస్తున్నారు. ప్రతి ఇంటికి క్లోరిన్ మందు బిల్లలను పంపిణీ చేస్తున్నారు అధికారులు. జ్వరాలు వచ్చినవారు వెంటనే ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
UK Heatwave: బ్రిటన్ లో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. అల్లాడుతున్న ప్రజలు.. రైళ్లు బంద్