లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లమందికి తాగునీరు అందిస్తున్న మహానది గోదావరి కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ అవుతోందా? భద్రాచలం వద్ద గోదావరి కాలుష్య కాసారంగా తయారైందా? గోదావరిలో మునిగితే రోగాలు గ్యారంటీనా? అంటే అవుననే అంటున్నారు. గోదావరికి భారీగా మురుగు నీరు వచ్చి చేరుతోంది. గోదావరిలోకి కెమికల్ నీళ్లు వచ్చి చేరుతున్నాయ్. పంటలు సాగు చేయటానికి ఆ నీటినే వాడుతున్నారు. అలా పండిన పంటలను తిని జనం రోగాల పాలవుతున్నారు. కలుషిత నీటిని తాగి ఆస్పత్రుల్లో చేరుతున్నారు జనం.…