వామపక్షాల తో కాంగ్రెస్ పొత్తు కొలిక్కి రానున్నది.. ఇప్పటికీ సిపిఐ తో ఒప్పందం దాదాపు గా కన్ఫర్మ్ అయింది. కొత్తగూడెం, చెన్నూరు ఖరారు అయ్యినట్లు గా చెబుతుండగా, సీపీఎం విషయం లో ప్రతిస్తంభన సాగుతోంది. సీపీఎం పార్టీకి మిర్యాలగూడ వైరా సీట్లు ఇస్తారని ప్రచారం జరిగింది అయితే వైరా సేటు విషయంలో కాంగ్రెస్ నాయకత్వం ఒక స్పష్టత ఇవ్వడం లేదని సీపీఎం పార్టీలో కొనసాగుతున్న చర్చ. ఈ నేపథ్యంలో వైరా సీటు సీపీఎంకి ఇవ్వకపోతే ఒప్పందానికి అంగీకరించేది లేదని సీపీఎం నాయకత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.
Also Read : Manchu Lakshmi : లక్కీ ఛాన్స్ కొట్టేసిన మంచు లక్ష్మీ.. దేవర సినిమాలో ఎన్టీఆర్కు ?
వైరా మిర్యాలగూడ రెండు సీట్లు ఇవ్వకపోతే అన్ని స్థానాల్లో పోటీ చేయడం కోసం సీపీఎం నాయకత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఈరోజు ఉదయం నుంచి ఖమ్మం జిల్లా సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో ఖమ్మం జిల్లా కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశంలో ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం రెండు సీట్లు ఇస్తేనే ఒప్పందానికి కట్టుబడి ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.
Also Read : Mother Sues Son: చదువుకు డబ్బులు ఇస్తే.. లవర్ కోసం కారు కొన్నాడు.. దీంతో కొడుకుపై కోర్టుకెళ్లిన తల్లి