Manchu Lakshmi : సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది టాలెంటెడ్ నటీమణులలో మంచు లక్ష్మి ఒకరు. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి తన మొదటి సినిమా అనగనగా ఓకే ధీరుడుతో అత్యుత్తమ నటనా ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రమంలో మంచు లక్ష్మి సినిమాలకు పెద్దగా ప్రేక్షకులు రాలేదు. నటిగా సక్సెస్ అయినప్పటికీ ఆమె చేసిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.
Read Also:IND vs ENG Dream11 Prediction: భారత్ vs ఇంగ్లండ్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
ఇప్పుడు సినిమాలో నటించకుండా ఖాళీగా ఉంటుంది. ఇక మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన ముగ్గురు వారసులు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో మోహన్ బాబు వారి కెరీర్ విషయంలో చాలా డిప్రెషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఒక్కరు సక్సెస్ అయినా కాస్త హ్యాపీగా ఫీలయ్యేవారు. ఇప్పుడు మోహన్ బాబుకు పెద్దగా సినిమాలు లేవు. ఖాళీగానే ఉంటున్నాడు. ఇదే క్రమంలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ అక్క క్యారెక్టర్ కోసం మంచు లక్ష్మిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆ క్యారెక్టర్ చాలా కీలకం కాబట్టి ఈ సినిమాలో మంచు లక్ష్మిని తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త కాస్త నిజం అయితే ఆమెకు వరుసగా సినిమాల్లో ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది.
Read Also:Hyderabad: చంపాపేట్ స్వప్న హత్య కేసులో ట్విస్ట్.. బయటపడిన సంచలన నిజాలు