కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మజ్లిస్ పార్టీకి బానిసలుగా మారిపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించారని ఆరోపించారు. మజ్లిస్ పార్టీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మజ్లిస్ మెప్పు కోసమే ఇతర పార్టీలు వారి అడుగులకు మడుగులు వత్తుతున్నాయని తెలిపారు. అన్ని పార్టీలు పోటీ చేస్తాయని భావించామని, కానీ రాహుల్ గాంధీ, కేసీఆర్‌లు పోటీ చేయకుండా మజ్లిస్‌కు ఏకగ్రీవం చేయాలని యత్నించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు మజ్లిస్‌కు అనుకూలంగా లేరని, అయితే మజ్లిస్ చేస్తున్న సంఘవిద్రోహ చర్యలను సమర్థించరని చెప్పారు.
READ MORE: Ramanaidu Studio Lands: రామానాయుడు స్టూడియో భూములపై షోకాజ్ నోటీసులు
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఓటర్లు తమ ఓటును ఆత్మసాక్షిగా వినియోగించాలని కోరారు. మజ్లిస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలు క్షమించరనిదని హెచ్చరించారు. మజ్లిస్ మద్దతు కోసమే బీఆర్‌ఎస్ పోటీ చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను వేర్వేరుగా చూడాల్సిన అవసరం లేదని, ఇవి రెండు కాదు ఒకటేనని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి వెళ్లిపోయిన నేతలకు కూడా విజ్ఞప్తి చేస్తూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. అన్ని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
READ MORE: Noida: నోయిడాలో సాఫ్ట్‌వేర్ హత్య.. కారణమిదేనా?
అనంతరం కేంద్ర మంత్రి కిషన్ కుమార్‌రెడ్డి జగ్జీవన్ రామ్ గురించి మాట్లాడారు. “మంచి విద్యా వేత్త, మానవతా వాది జగ్జీవన్ రామ్. రాజకీయాల్లో ప్రత్యేక స్టానాన్ని సంపాదించుకొని ఉప ప్రధాని మంత్రి వరకు ఎదిగారు. ఎమర్జెన్సీ లో ఇందిరాగాంధీ కి వ్యతిరేకంగా బయటకు వచ్చారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని స్ఫూర్తి గా తీసుకొని అందరికీ హక్కుల కోసం కృషి చేసిన వ్యక్తి. 1977 లో తన పార్టీ నీ జనతా పార్టీ లో విలీనం చేశారు. ఆయన ను ప్రధానిగా ప్రకటించి 1980 లో బీజేపీ ఎన్నికలకు వెళ్ళింది… కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ అడ్డుకుంటుంది. ఆయన్ను ప్రధాని కాకుండా అడ్డుకున్నది దుర్మార్గ కాంగ్రెస్ పార్టీ.ఆయన ఆలోచన విధానం తో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే అంకిత భావం తో మోడీ ప్రభుత్వం పని చేస్తుంది. ఆయనతో పాటు కల్సి కూర్చునే అవకాశం ఒక విద్యార్థి నేతగా నాకు 1978 లో వచ్చింది.. నా రాజకీయ ప్రస్థానం అయన సభతోనే ప్రారంభం అయింది.” అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.