Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మరణించి 14 రోజులైనా పోస్టుమార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు అరి అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ ప్రశ్నించారు. ప్రవీణ్ భార్య ప్రభుత్వంపై నమ్మకం ఉన్నదని చెప్పడంతో మాకు ఏం కాదని ప్రభుత్వం భావిస్తుందా?.. పోలీసులు యాక్సిడెంట్ కోణంలోనే విచారణ చేస్తున్నారు.. యాక్సిడెంట్ గా చూపెట్టడం కోసం 24 గంటలు పోలీసులు ప్రయత్నిస్తారు.. ఇది కచ్చితంగా హత్య.. కచ్చితంగా హైదరాబాదులో రి- పోస్టుమార్టం చేయిస్తాను అని ఆయన తెలిపారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వమని పోలీసులను కోరిన ఇవ్వలేదు.. పోలీసులు మీడియా మీద సోషల్ మీడియా పైనా కేసులు పెట్టి భయ పెట్టాలని చూస్తున్నారు అంటూ హర్ష కుమార్ పేర్కొన్నారు.
Read Also: Purandeswari: వక్ఫ్ బోర్డులో మాత్రమే సవరణలు.. మతపరమైన అంశంలో కాదు..
ఇక, ప్రవీణ్ కుటుంబ సభ్యులతో కలిసి మేము కూడా మొదటి నుంచి హత్య కేసు అని వాదిస్తున్నామని మాజీ ఎంపీ హర్ష కుమార్ తెలిపారు. నాపై పోలీసులు కేసులు పెట్టారు.. నిజాన్ని బయట పెట్టాలన్నదే నా ఉద్దేశం.. నేను సర్కులర్ ని.. నేను ఎక్కడ మతవిద్వేశాలు రెచ్చగొట్టలేదు అని తేల్చి చెప్పారు. పిచ్చి పిచ్చి కేసులు పెడితే భయపడను.. నాపై కేసులు వెంటనే ఉపసంహరించుకోండని పోలీసులకు హెచ్చరిక జారీ చేశారు. పాస్టర్ ప్రవీణ్ లిక్కర్ తాగారు అంటూ అతడి క్యారెక్టర్ ను బ్యాడ్ చేస్తున్నారు అని హర్ష కుమార్ మండిపడ్డారు.