Virat Kohli: ఆఫ్ఘనిస్తాన్ నేత, తాలిబాన్ ఉద్యమ నాయకుడు అనస్ హక్కానీ నుంచి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన అభ్యర్థన వచ్చింది. విద్య, క్రీడలు అంటేనే కోపగించుకునే తాలిబాన్లలో కూడా విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారని ఈ ఘటన రుజువు చేస్తోంది. అనాస్ హక్కానీ కూడా క్రికెట్‌కు, కోహ్లీకి అభిమాని. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్లపై హక్కానీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరిద్దరు మే 2025లో రిటైర్మెంట్ ప్రకటించారు.
టీమిండియా ప్రమాదంలో పడనుందా..? యంగ్ స్టార్స్ భారత్ ను ముందుకు తీసుకెళ్లగలరా? రెండు దశాబ్దాలుగా ఎదురులేని భారత్ ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ ముందు ఎందుకు బలహీనంగా కనిపిస్తుంది. దీనికి ఎవరు కారణం? గంభీర్ నిర్ణయాలు కొంపముంచుతున్నాయా? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలెన్నో తలెత్తుతున్నాయి. కోహ్లీ, రోహిత్ తప్పుకోవడంతో రెడ్ బాల్ క్రికెట్ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ, రోహిత్ దశాబ్దకాలం పాటు టెస్ట్ క్రికెట్ ను కాపాడుతూ వచ్చారు. టెస్టుల్లో కోహ్లీ నాయకత్వంలో భారత్ చాలా కాలం పాటు…
ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు నిర్ణీత 20 ఓర్లలో 05 వికెట్లు కోల్పోయి 221 పరుగులు సాధించి ముంబైకి 222 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ ఆరంభంలోనే ఆర్సీబీకి ముంబై బౌలర్ ట్రెంట్ బౌల్ట్ షాకిచ్చాడు.…
India vs England: కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనున్న భారత్, ఇంగ్లాండ్ రెండో వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ గెలిచింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. సిరీస్ గెలవాలనే ఉద్దేశ్యంతో టీం ఇండియా ఈ మ్యాచ్‌లోకి దిగుతుండగా.. ఇంగ్లాండ్ జట్టు సిరీస్‌ను డ్రా చేసుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది. దీనితో…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త రిటెన్షన్ నిబంధనను రూపొందించింది. అక్టోబర్ 31 లోపు అన్ని ఫ్రాంచైజీలు రిటైన్ చేయబడిన ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని కోరింది. ఐపీఎల్ 2025 కోసం బీసీసీఐ అనేక కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ క్రమంలో.. ఈసారి మెగా వేలం చాలా ఆసక్తికరంగా ఉండనుంది. తదుపరి సీజన్ కోసం మెగా వేలానికి ముందు.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ ఆర్సీబీకి సలహా ఇచ్చాడు. ఆర్సీబీ విరాట్ కోహ్లీని రిటైన్ చేసుకుని..…
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. భారత్ విజయంలో విరాట్ కోహ్లీ 76 పరుగులు చాలా కీలకం.
టీ20 ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన చూపించలేకపోతున్నారు. అయినప్పటికీ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఓపెనింగ్ జోడీని భారత్ కొనసాగించాలని లెజెండరీ వెస్టిండీస్ క్రికెటర్ బ్రియాన్ లారా అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్‌కే (1, 4, 0) పరిమితమయ్యాడు. మరోవైపు.. రోహిత్ ఐర్లాండ్‌పై హాఫ్ సెంచరీతో రాణించాడు.. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లలో 13, 3 పరుగులకే ఔటయ్యాడు. అయితే.. వీరిద్దరూ తక్కువ స్కోర్లు చేసినప్పటికీ..…
ఈ ఐపీఎల్ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ కోసం పలువురు క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఐపీఎల్ అంటేనే ఊహించనిది.. అప్పటి దాకా ఎలాంటి ఫామ్ లో లేని బ్యార్లు సైతం బౌలర్లను వణికిస్తుంటారు. ఎక్కువ పరుగులు సాధించేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై కేకేఆర్ విజయం సాధించింది. 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఒక్క రన్ తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింకు దిగిన కోహ్లీ 18 రన్లు చేసి.. హర్షిత్ రాణా చేతిలో ఔటయ్యాడు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఇండియా తలపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ‘బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ద డే’గా ఎంపికయ్యాడు. ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ కు 'బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది డే' బిరుదు ఇచ్చింది. అయితే అందుకు సంబంధించి డ్రెస్సింగ్ రూమ్‌లో కింగ్ కోహ్లీ స్వయంగా తన చేతులతో శార్దూల్‌కు పతకాన్ని అందించాడు. శార్దూల్ అద్భుతమైన ఫీల్డింగ్ కారణంగా ఈ పతకం లభించింది.