ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఎప్పటికి మర్చిపోలేనిది. అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూక పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపు దాదులతో విరుచుకుపడి.. 100 మంది ఉగ్రవాదులను హతమార్చిన. అయితే ఈ విషయం పై ఇప్పటికే చాలా మంది హరోలు రియాక్ట్ అయ్యారు. కానీ బాలీవుడ్ సెలబ్రిటీలు ఆపరేషన్ సిందూర్ గురించి పెదవి విప్పడం లేదంటూ ఇటీవల కొన్ని విమర్శలు ఎదురైనా విషయం తెలిసిందే. దీంతో కొందరు బీ టౌన్ ప్రముఖులు దీని గురించి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. రణ్ వీర్ సింగ్, అక్షయ్ కుమార్ ప్రశంసలు కురిపిస్తూ ఇటీవల పోస్ట్‌లు పెట్టారు. ఇందులో భాగంగా తాజాగా అజయ్ దేవగన్ స్పందించారు.
Also Read : NTR : దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో ఎన్టీఆర్..!
ముంబయిలో జరిగిన ‘కరాటే కిడ్ లెజెండ్స్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు అజయ్ దేవగన్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో భాగంగా ఆయన తొలిసారి ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు.. ‘చెప్పాల్సిన అవసరం లేదు.. ఎవరూ యుద్ధ జరగాలి అని కోరుకోరు. కానీ.. దీనికి వేరే దారి లేనప్పుడు యుద్ధమే ఏకైక మార్గం అవుతుంది. నేను సాయుధ దళాలకు, ప్రధానికి, ప్రభుత్వానికి సెల్యూట్ చేస్తున్నాను. వారి పనిని వారు ధైర్యంగా, ప్రశంసనీయంగా చేశారు’ అని అన్నారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.