Sperm Count: ప్రస్తుతం పురుషుల్లో వీర్యకణాల సంఖ్య (Sperm Count) తగ్గిపోవడం ఒక సామాన్యమైన సమస్యగా మారింది. ఇది సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేయడంతో పాటు శారీరక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పరిశోధనల ప్రకారం, చాలామంది పురుషుల్లో 40 ఏళ్లకంటే ముందు స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతోందని తేలింది. బ్యాడ్ లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత వంటి అంశాలు దీని వెనుక ప్రధాన కారణాలు. ఆరోగ్యంపై సరైన శ్రద్ధ పెట్టకపోవడం, ధూమపానం, మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం వంటి అలవాట్లు స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి దోహదపడతాయి. ముఖ్యంగా ఆహారం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది.
Read Also: Bird Flu Tension: కోళ్లకు వైరస్.. కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణమయ్యే ఆహారాలు:
సోయా ఉత్పత్తులు:
సోయా ఉత్పత్తులలో ఉన్న మొక్కల ఆధారిత ఈస్ట్రోజెన్‌లు పురుషుల్లో హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తాయి. ఎక్కువగా తీసుకుంటే ఇది వంధ్యత్వానికి కారణం కావచ్చు.
ప్రాసెస్ చేసిన మాంసం:
ప్రాసెస్ చేసిన మాంసాలను టేస్టీగా అనిపించవచ్చు. కానీ, వీటిలో ఉన్న రసాయనాలు స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. సాధ్యమైనంత వరకు తాజా, సహజ మాంసాన్ని మాత్రమే తినడం మంచిది.
ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారాలు:
ట్రాన్స్ ఫ్యాట్స్ గుండె జబ్బులకు కారణం కావడమే కాకుండా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి బేకరీ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ వంటి వాటిని తగ్గించాలి.
Read Also: Trump: జోర్డాన్, ఈజిప్ట్‌లకు ట్రంప్ హెచ్చరిక.. పాలస్తీనియన్లను చేర్చుకోకపోతే..!
పురుగుమందులతో పండించిన కూరగాయలు, పండ్లు:
ప్రస్తుతం చాలా వరకు ఆహార ఉత్పత్తులు రసాయనిక పురుగుమందుల ద్వారా పండుతున్నాయి. సరిగ్గా కడగకుండా ఈ ఆహారాలను తీసుకోవడం పునరుత్పత్తి ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తుంది.
నాన్‌స్టిక్ పాత్రల ఉపయోగం:
నాన్‌స్టిక్ పాత్రలలో వంట చేయడానికి ఉపయోగించే కొన్ని రసాయనాలు పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు నాన్‌స్టిక్ పాత్రల వాడకం తగ్గించండి.
పూర్తి కొవ్వు పాలు:
పాలను అధికంగా తాగడం ఆరోగ్యానికి మంచిదే. కానీ, పూర్తి కొవ్వు పాలు మాత్రం సమస్యలకు కారణం కావచ్చు. ఆవులకు ఇస్తున్న హార్మోన్ల ప్రభావం పాలను తాగడం ద్వారా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది.
కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించడం, సరైన ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా పురుషులు తమ స్పెర్మ్ కౌంట్‌ను మెరుగుపరుచుకోవచ్చు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాన్ని ఆహారంలో చేర్చడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. మానవ శరీర ఆరోగ్యం మెరుగుపడాలంటే మార్పులు అనివార్యం. సరైన ఆహారం, వ్యాయామం, మంచి జీవనశైలి స్పెర్మ్ కౌంట్‌ను సహజంగా పెంచడంలో సహాయపడతాయి.