దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దలు వరకు ఎంతో సంతోషంగా రంగులు పూసుకుంటూ కేరింతలు కొట్టారు. ఇదిలా ఉంటే ఓ వైపు దేశ వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. గత కొద్ది రోజులుగా అభ్యర్థుల ఎంపికపై ఆయా పార్టీలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. నాయకులు ఇంత బిజీ షెడ్యూల్‌లో ఉన్న కూడా తమ పనులు పక్కన పెట్టి మరీ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా నాయకులంతా హోలీ వేడుకల్లో పాల్గొని సంబరాలు చేసుకున్నారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా కుటుంబంతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. తన మనవుడితో కలిసి రేవంత్ హోలీ జరుపుకున్నారు. మనవుడిపై రంగులు పూసి మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇలా ఆయా పార్టీల నేతలంతా హోలీ సంబరాల్లో మునిగిపోయారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి హోలీ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న మరోసారి దేశ వ్యాప్తంగా హోలీ జరుపుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Chandrababu: ఒకటో తేదీనే ఇంటి వద్దకే రూ. 4వేల పింఛన్..
ఇక ఏపీలో మంత్రి అంబటి రాంబాబు హోలీ వేడుకల్లో భాగంగా డ్యాన్స్‌లు చేశారు. కార్యకర్తలతో కలిసి రంగులు పూసుకున్నారు. అనంతరం వారితో కలిసి స్టెప్పులు వేశారు. ఢిల్లీలో మాత్రం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా హోలీ వేడుకలను జరుపుకోవడం లేదని ఆప్ ప్రకటించింది. కేజ్రీవాల్ వేసిన అత్యవసర పిటిషన్ బుధవారం హైకోర్టు విచారించనుంది.
ఇది కూడా చదవండి: Inimel: డైరెక్టర్ లోకేష్ తో శృతి హాసన్ ప్రేమ, పెళ్లి, విడాకులు..