రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి కొందరు వ్యక్తులు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదాన్ని నింపింది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు, ముసారాంబాగ్ మాజీ బీఆర్‌ఎస్ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కనిష్క్ రెడ్డి మరణంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.…
సంగారెడ్డి జిల్లా నిజాంపేట (మం) ఖానాపూర్(బీ) గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఒంటిపై ఉన్న బంగారు గుండ్ల కోసం అమ్మమ్మను హత్య చేశాడు మనవడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో డబ్బులు, మెడలోని బంగారు గుండ్ల కోసం అమ్మమ్మ దుర్గమ్మ(60)తో గొడవపడ్డాడు మనవడు మహేష్(26).
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమ్‌లకు వ్యసనంగా మారి ఓ యువకుడు తన అమ్మమ్మన్ను హత్య చేశాడు. ఈ ఘటన ఘజియాబాద్‌లోని సాహిబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కెనడా పర్యటనకు వెళ్లిన భారతీయ దంపతులు.. వారి మూడు నెలల మనవడు సహా నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. మద్యం మత్తులో రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో.. ఈ ప్రమాదం జరిగిందని అక్కడి పోలీసులు చెబుతున్నారు. టొరంటోకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విట్బీలోని హైవే 401లో నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించారని అంటారియో పోలీసులు గురువారం తెలిపారు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో తన 75 ఏళ్ల అమ్మమ్మపై దాడి చేసినందుకు ఒక వ్యక్తి. అతని భార్యను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి మార్చి 28న తెలిపారు. వృద్ధురాలిని చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను దీపక్ సేన్, అతని భార్య పూజా సేన్ నగరంలోని జహంగీరాబాద్, బర్ఖేడి నివాసితులుగా గుర్తించారు. భోపాల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP, జోన్ 1) ప్రియాంక శుక్లా…
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఇండియా కూటమి బలహీనపడుతున్న వేళ.. కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కూడా వెళ్లిపోవడం పార్టీని కలవరపెడుతోంది.