టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఇవాళ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో చంద్రబాబు మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక.. మీ ఇంటికే ఒకటో తేదీనే పింఛన్ ఇచ్చేలా చేస్తామని అన్నారు. పింఛన్ ను నాలుగు వేలు పెంచి ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ముస్లింలకు అండగా నిలిచే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను కాపాడింది టీడీపీయేనని అన్నారు. ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులు రక్షించామని తెలిపారు.
IPL 2024: ఐపీఎల్ మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ విడుదల..
మరోవైపు.. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ కు అడ్డాగా మార్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల వల్ల జాతి మొత్తం నాశనం అవుతుందని పేర్కొన్నారు. రాష్ట అభివృద్ది కోసమే పొత్తులు పెట్టుకున్నామని.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అజెండా అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సాయం అవసరమని తెలిపారు. ఈసారి 160 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాలు గెలవాలని చెప్పారు. ఇప్పటివరకు మీరు తనపై ఏడుసార్లు అభిమానం చూపించారు.. కుప్పంలో వైసీపీ అభ్యర్థికి ఈసారి డిపాజిట్లు కూడా రాకూడదని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి జగన్ ప్రభుత్వం అడ్డుపడిందని దుయ్యబట్టారు.
CM Jagan: ఎల్లుండి నుంచి ‘మేమంతా సిద్ధం’.. బస్సుయాత్ర చేపట్టనున్న సీఎం జగన్
ముప్పై ఏళ్లు రాష్ట్రాన్ని జగన్ వెనక్కి తీసుకెళ్ళాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారని.. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులతో వారిని నియంత్రిస్తామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా.. జైలు నుంచి బయటికి రాగానే పార్టీ జెండా మోయడం ఆపలేదన్నారు. ఈసారి కుప్పంలో టీడీపీకి లక్ష మెజార్టీ లక్ష్యం అని చంద్రబాబు తెలిపారు. పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నానని చంద్రబాబు పిలుపునిచ్చారు.