Anant Ambani-Radhika Merchant: అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా కొనసాగింది. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, తన ప్రేయసి రాధిక మర్చంట్ తో వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు.
రేపు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో దేశంలోనే అత్యున్నతమైన వివాహం జరగనుంది. పెళ్లికి హాజరయ్యేందుకు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా అతిథులు వస్తున్నారు.
అనంత్, రాధిక వివాహం జులై 12న జరగనుంది. అనంతరం జులై 13న శుభాశీర్వాద కార్యక్రమం, 14న స్వాగత కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లో జరుగుతాయి.
యూఎస్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ జూలియా చాఫే ఎయిర్‌పోర్టులో తన లగేజీ పోగొట్టుకుంది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల పెళ్లి కోసం భారత్‌కు వస్తున్నప్పుడు ఎయిర్‌లైన్‌లో తన లగేజీని పోగొట్టుకుంది. ఈ మేరకు ఆమె వీడియో ద్వారా సమాచారాన్ని తెలియజేసింది.