Raj Tarun Ex Lavanya Wants to Meet Pawan kalyan: హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి తనతో సహజీవనం కూడా చేసి ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడు అంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయం మీద ఆమె పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ క్రమంలోనే ఆధారాలు సబ్మిట్ చేయడంతో రాజ్ తరుణ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. లావణ్య కేసులో హీరో రాజ్‌తరుణ్‌ను ఏ-1 చేర్చిన పోలీసులు, ఏ-2గా మాల్వి మల్హోత్రా.. ఏ-3గా మయాంక్ మల్హోత్రలను చేర్చాడు. 2010లో రాజ్‌తరుణ్ తనకు ప్రపోజ్ చేశాడని, 2014లో నన్ను పెళ్లి చేసుకున్నాడని లావణ్య చెవుతోంది. రాజ్ తరుణ్‌ను మా కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుంది.
Darling Censor: ప్రియదర్శి డార్లింగ్ సెన్సార్ రివ్యూ
రాజ్‌తరుణ్‌కు ఇప్పటివరకు రూ.70 లక్షలు ఇచ్చామని, ఆయన 15 కుక్కల కారణంగా 6 సంవత్సరాల్లో 6 ఇల్లులు మార్చామని కూడా లావణ్య చెబుతోంది. అంతేకాదు రాజ్‌తరుణ్, మాల్వి కలిసి నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించారని లావణ్య ఆరోపిస్తోంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దేవుళ్లలో శివుడు మనుషుల్లో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం మొదలు కార్ వెనుక స్టిక్కర్ దాకా ఆయన మీద చాలా ప్రేమ ఉందని అన్నారు. ఇప్పుడు కూడా ఆయనను కలిసి ఆయనకు రాజ్ తరుణ్ నన్ను ప్రేమించి నమ్మించి మోసం చేశాడని ఆయన దృష్టికి తీసుకు వెళ్లాలని అనుకుంటున్నానని ఆమె అన్నారు. పవన్ కి కూడా రెండు మూడు పెళ్లిళ్లు అయ్యాయి కానీ వాళ్ళని పవన్ గౌరవంగా, భాద్యతగానే చూసుకుని ఉంటారు. కానీ రాజ్ తరుణ్ అలా కాదు నాకు , పిల్లల(రాజ్ తరుణ్ 15 కుక్కలు)కు కనీసం తిండి తినడానికి కూడా డబ్బు ఇవ్వడం లేదని లావణ్య పేర్కొంది.