భారత్-న్యూజిలాండ్ మధ్య 5 టీ20 ల సిరీస్ నేటి నుంచి ప్రారంభంకానుంది. జనవరి 21, బుధవారం ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనున్నది. 785 రోజుల తర్వాత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ T20I లకు తిరిగి వచ్చాడు. ఈ విషయాన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధృవీకరించారు. నాగ్‌పూర్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో కిషన్ భారత్ తరపున 3వ ప్లేస్ లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇషాన్ కిషన్ చివరిసారిగా నవంబర్ 28, 2023న ఆస్ట్రేలియాతో…
టీమిండియాకు దాదాపు రెండేళ్లుగా దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ నిరీక్షణకు ముగింపు పడింది. న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్.. నాగ్‌పూర్‌లో బుధవారం జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడటం ఖాయమైంది. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రీ మ్యాచ్ ప్రెస్మీట్లో ధృవీకరించారు. ఇషాన్ కిషన్ నంబర్–3 స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని చెప్పాడు. దాంతో స్టార్ ప్లేయర్…
ఇండోర్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ ఒక బ్రౌన్ కలర్ డ్రింక్ తాగడం, ఆ తర్వాత అతను ఇచ్చిన వింత ఎక్స్ప్రెషన్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా కోహ్లీ ముఖంలో కనిపించిన హావభావాలు ఈ ఆసక్తిని మరింత పెంచాయి. దీంతో ఆ డ్రింక్ ఏంటనే విషయంపై నెట్టింట ఆసక్తికర చర్చ మొదలైంది. ఆ వీడియోను…
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ చరిత్ర సృష్టించాడు. భారత గడ్డపై కనీసం నాలుగు వన్డే సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్‌తో జరిగిన మూడో వన్డేలో శతకం బాదడంతో ఈ రికార్డు అతడి ఖాతాలో చేరింది. 34 ఏళ్ల మిచెల్.. భారత్‌లో టీమిండియాపై ఆడిన తన 8వ వన్డేలోనే నాలుగో సెంచరీ సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో మిచెల్ 104 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. భారత గడ్డపై…
Ind vs NZ 2nd ODI: భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్ 2026లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. తొలి వన్డేలో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా బుధవారం (జనవరి 14) రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగే రెండో వన్డేలో సిరీస్‌ను గెలుచుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు జట్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి వన్డేలో వాషింగ్టన్ సుందర్ గాయంతో సిరీస్‌కు దూరం కావడం…
భారత్–న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగతా వన్డే మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతని స్థానంలో యువ ఆల్‌రౌండర్ ఆయుష్ బదోనిని జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. 26 ఏళ్ల బదోని భారత జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. బుధవారం రాజ్‌కోట్‌లో జరిగే రెండో వన్డేకు అతడు అందుబాటులోకి రానున్నాడు. బదోని బ్యాటర్ మాత్రమే కాదు.. ఆఫ్ స్పిన్నర్ కూడా. మొదటి వన్డేలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్…
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయంలో తన వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉందని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెప్పాడు. లక్ష్య ఛేదనలో పరుగులు చేయడమే కాదు, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటమే అత్యంత ముఖ్యమని అన్నాడు. గతం గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు టెన్షన్‌కు పోకుండా.. ప్రస్తుతంపై పూర్తిగా దృష్టి పెడుతా అని గిల్ తెలిపాడు. ప్రస్తుతం గురించి ఆలోచించినపుడే విజయాల ఆనందాన్ని, అపజయాల నిరాశను సమతూకంగా ఎదుర్కొనగలమని గిల్ తెలిపాడు.…
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం వడోదరలో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కింగ్ విరాట్ కోహ్లీ (93; 91 బంతుల్లో 8×4, 1×6) సూపర్ ఇన్నింగ్స్ ఆడగా.. శుభ్‌మన్ గిల్ (56), శ్రేయస్ అయ్యర్ (49) రాణించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 8 వికెట్లకు 300 పరుగులు చేసింది. లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఈ…
భారత క్రికెట్ చరిత్రలో వన్డే ఫార్మాట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఫార్మాట్లో అనేక మంది దిగ్గజాలు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి.. తమ ఆటతో కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. వన్డేల్లో మొదటి డబుల్ సెంచరీ చేసి అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నారు. అలానే అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ మొదటి స్థానంలో ఉన్నారు. భారత్ తరఫున మొత్తం 463 వన్డే మ్యాచ్‌లు…
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదరలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత ప్లేయింగ్ 11లోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. పొట్టలో గాయం కారణంగా కొన్ని నెలలుగా శ్రేయస్ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఆకట్టుకోవడంతో అతడు జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన శ్రేయస్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం…