ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా జరిగిన భారత్, న్యూజిలాండ్ 3 టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ముంబైలో జరిగిన మూడో టెస్టులో టీమిండియా విజయం ముందర బొక్కబోర్లా పడింది. దాంతో 25 పరుగులతో కివిస్ విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో టీమిండియా న్యూజిలాండ్ చేతిలో 3 – 0 తో క్లీన్ స్వీప్ అయ్యింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకునేందుకు టీమిండియా పరిస్థితి దారుణంగా తయారయింది.
చలికాలంలో శరీరంతోపాటు చర్మం కూడా వివిధ ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే చలికాలంలో చర్మానికి కాంతిని, ఆరోగ్యాన్ని అందించే విటమన్ ‘సి’ ఉన్న పళ్లను ఇతర పదార్థాలను తీసుకుంటే మంచిది. ఈ కాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను నివారించగల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని వినియోగించుకుని చలి కాలంలో వచ్చే రుగ్మతలను దూరం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో చాలామంది నీటిని అంతగా తాగరు. కానీ వేసవిలో ఎంత నీరు తాగుతామో చలికాలంలో కూడా నీటిని…