KTR: పిరమైన ప్రధాని @narendramodi గారు.. మీరు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. యావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలు అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కొన్ని ప్రశ్నలను సంధించారు. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండని తెలిపారు. శాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగండి..!! అన్నారు. ప్రధానిగా పదేళ్లు గడిచినా.. తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి..!! అని ప్రశ్నించారు. ఒక్క తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు..
ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదో చెప్పండి..!! అన్నారు. మా యువతకు ఉపాధినిచ్చే…కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎందుకు పాతరేశారో చెప్పండన్నారు.
Read also: Heavy Rain: పశ్చిమ బెంగాల్ లో భారీ వర్షం.. 12 మంది మృతి
మా ఏజెన్సీ బిడ్డలకు బతుకు దెరువునిచ్చే.. బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని ఎందుకు బొందపెట్టారో చెప్పాలన్నారు. మా నవతరానికి కొండంత భరోసానిచ్చే.. ఐటీఐఆర్ ITIR, Hyderabad ప్రాజెక్టును ఎందుకు ఆగం చేశారో చెప్పాలని కోరారు. తమ పిల్లల బంగారు భవితపై ఆశలు పెట్టుకున్న.. లక్షలాది తల్లిదండ్రుల ఆశయంపై ఎందుకు నీళ్లు జల్లారో చెప్పాలని.. చివరగా ఒక మనవి… రెచ్చగొట్టే రాజకీయాలకు.. ఇక్కడ ఓట్లు పడవు..! ఎందుకంటే.. ఇది తెలంగాణ గడ్డ.. ప్రజా చైతన్యానికి అడ్డ..!! అంటూ ప్రధాని మోడీకి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
పిరమైన ప్రధాని @narendramodi గారు..
మీరు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో..
యావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలు..
———————————–దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..!
దశాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగండి..!!ప్రధానిగా పదేళ్లు…
— KTR (@KTRBRS) May 7, 2024
D. Sridhar Babu: రాజ్యాంగాన్ని తిరిగి రాయలన్న కుట్రలో బీజేపీ ఉంది..