ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై రెండు పిటిషన్లు వేసింది. ఏడుగురు ఎమ్మెల్యేల ఫిరాయింపుపై రిట్ పిటిషన్, ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎస్ఎల్పీ పిటిషన్ వేసింది బీఆర్ఎస్. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిపై ఎస్ఎల్పీ వేయగా.. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్ ను ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరింది బీఆర్ఎస్.. ఢిల్లీలోని లీగల్ టీమ్‌తో మాజీ మంత్రి హరీష్ రావు చర్చలు జరిపారు. ఎమ్మె్ల్యేల అనర్హతపై నిర్ణయంలో స్పీకర్ జాప్యం చేయడంతో ముందుగా ఆశ్రయించింది బీఆర్ఎస్.. హైకోర్టు నిర్ణయాన్ని స్పీకర్ కే వదిలేసింది. దీంతో సుప్రీం కోర్టులోనే తేల్చుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
Read Also: Saif Ali Khan: రక్తం కారుతున్న సైఫ్ అలీ ఖాన్‌ని “ఆటో”లో తీసుకెళ్లిన కొడుకు..
బీఆర్ఎస్ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీని గందరగోళంలోకి నెట్టింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ను తెర మీదకు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఈరోజు ఉదయం లీగల్ టీమ్ తో సంప్రదించిన తర్వాత అనర్హత అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. కాంగ్రెస్ లో పార్టీకి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విధంగా చర్యలు తీసుకునే అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. తెలంగాణ హైకోర్టులో రెండు దఫాలుగా రెండు కోర్టుల్లో విచారణ జరిగింది. మొదట సింగిల్ బెంచ్ దీనికి సంబంధించి ఉత్తర్వులు వెల్లడించింది. నెలలోకా ఒక షెడ్యూల్ తయారు చేయాలని.. స్పీకర్ ఛాంబర్ నుంచి షెడ్యూల్ రావాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు.. డివిజన్ బెంచ్ ఒక ఉత్తర్వును వెల్లడించింది. స్పీకర్ నిర్ణయానికే అనర్హత అంశాన్ని వదిలివేస్తున్నట్లు చెప్పింది. కానీ ఒక టైం బాండ్ ఫిక్స్ చేసుకోవాలని.. సరైన సమయంలోగా అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. కానీ స్పీకర్ ఎన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి.. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు వేయాలన్న దానిపై స్పష్టత లేదు. ఈ క్రమంలో స్పీకర్ జాప్యం చేస్తుండటంతో బీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. వచ్చే వారం రెండు పిటిషన్లు విచారణకు రానున్నాయి. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు జరుగుతాయి.. ఏ విధమైన తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.