Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దుండుగుడి దాడి యావత్ సినీ పరిశ్రమని షాక్‌కి గురిచేసింది. గురువారం తెల్లవారుజామున సైఫ్ ఇంటిలోకి ప్రవేశించిన దుండుగుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. నటుడి ఒంటిపై మొత్త ఆరు కత్తిపోట్లు ఉన్నాయి. మెడపై , వెన్నుముకలో తీవ్రమైన గాయాలయ్యాయి. ఆ సమయంలో సైప్ అలీ ఖాన్ పెద్ద కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తన తండ్రిని వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించారు.
ఆ సమయంలో కారు రెడీగా లేకపోవడంతో రక్తం కారుతున్న తన తండ్రిని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. సమయం వృధా చేయొద్దని భావించిన ఇబ్రహీం వెంటనే బాంద్రాలోని ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాడి జరిగిన కొన్ని క్షణాల తర్వాత తీసిన వీడియోలో సైఫ్ భార్య కరీనా కపూర్ ఖాన్ ఆటో పక్కన నిలబడి ఇంటి సిబ్బందితో మాట్లాడున్నట్లు కనిపిస్తోంది.
Read Also: Vidaamuyarchi : అజిత్ ‘విదాముయార్చి’ తెలుగు టైటిల్ ఇదే
54 ఏళ్ల సైఫ్ ఇంటిలోకి రాత్రి సమయంలో ఓ దొంగ చొరబడ్డాడు. ఈ క్రమంలోనే సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం అతడికి శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడినట్లు వైద్యులు చెప్పారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి దొంగతనం చేయడానికి దుండగుడు ప్రవేశించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. దాడికి రెండు గంటల ముందు సైఫ్ ఇంట్లోకి ఎవరూ ప్రవేశించిన దాఖలాలు లేవని, దుండగుడు ముందుగానే భవనంలోకి ప్రవేశించి దాడి చేయడానికి వేచి ఉన్నట్లు తెలుస్తోంది.
దుండుగుడు దాడి చేసిన తర్వాత పారిపోయాడు, అతడిని గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. దాడి చేసిన వ్యక్తికి ఇంట్లో ఒకరితో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తే దుండగుడు ఇంట్లోకి ప్రవేశించేందుకు సాయపడినట్లు తెలుస్తోంది.