Botsa Jhansi Lakshmi: నీతివంతమైన పాలనను సీఎం జగన్ అందించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర ప్రదేశ్ లో మరో నెల రోజుల్లో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి విజయం ఎవర్ని వరిస్తుందో అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థినిగా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో బొత్స ఝాన్సీ ప్రచారం నిర్వహించారు.
Also Read
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
అయితే, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం జగన్ సున్నా వడ్డీతోని ప్రతి అక్కచెల్లమ్మలకు లక్షలాది రూపాయలను అందించారు.. వీటితో పాటు చేయూత, ఆసరా, కాపూ నేస్తంతో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మేర తోడుగా అన్నతమ్ముడిలాగా ఈ నాలుగు సంవత్సరాల 10 నెలల కాలంలో సీఎం జగన్ ఒక్కరికి 90 వేల రూపాయలను నేరుగా వారి అకౌంట్లోకి వేశారని తెలిపారు. అలాగే, ఒక్క రూపాయి అయినా సరే అవినీతికి పాల్పడకుండా.. నీతివంతమైన పాలన అందించారు అని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో పెన్షన్ కావాలంటే ఎవరైనా చనిపోతే కానీ వచ్చేది కాదు.. అది కూడా పచ్చ చొక్క వేసుకున్న వారు రికమెండేషన్ చేస్తే ఆ పెన్షన్ వచ్చేది అని బొత్స ఝాన్సీ లక్ష్మీ పేర్కొన్నారు.
Read Also: BAAK : పంచుకో అంటున్న హాట్ బ్యూటీస్.. స్పెషల్ సాంగ్ వైరల్..!!
కానీ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందరి ఇంటికి వెళ్లి మరీ సంక్షేమ పథకాలను అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది అని బొత్స ఝాన్సీ లక్ష్మీ తెలిపారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించి.. మరోసారి జగన్ ముఖ్యమంత్రి అయితే.. పేదల ప్రభుత్వం వస్తుంది, ధర్మప్రభుత్వం వస్తుంది, నీతివంతమైన పాలన వస్తుందని చెప్పుకొచ్చారు. పొరపాటున కూడా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే.. అధర్మ పరిపాలన రావడంతో కరువు తాండవీస్తుంది, అవినీతిమైతుందన్నారు. మన పిల్లల భవిష్యత్ బాగుండాలంటే విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తాను అని జగన్ తెలిపారు.. అందువల్ల మన పిల్లల భవిష్యత్ బంగారు మయం అవుతుందన్నారు. విశాఖను రక్షించుకుందాం.. కూటమిని తరిమికొడుదాం అంటూ పిలుపునిచ్చారు. ప్రజలు పిలిస్తే పలికే మన వాసుపల్లి గణేష్ ను కూడా గెలిపించాలన్నారు. అలాగే, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం.. జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకుందామని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మీ కోరారు.
తాజావార్తలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!