Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- భూమి రికార్డులు భారత పౌరసత్వానికి ఆధారం కాదన్న కలకత్తా హైకోర్టు.
- ఆస్తి కొనుగోలు చేసినంత మాత్రాన భారతీయుడు కాలేరని స్పష్టీకరణ.
- బంగ్లాదేశ్ చొరబాటుదారుడిగా అనుమానిస్తున్న వ్యక్తి కేసులో వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Citizenship: భూమి రికార్డులు లేదా ఆస్తి పత్రాలు భారత పౌరసత్వానికి రుజువు కాదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. విదేశీయుడు భారతదేశంలో ఆస్తి కొనుగోలు చేసినంత మాత్రాన అతను భారతీయ పౌరుడిగా మారిపోడని పేర్కొంది. బంగ్లాదేశ్‌కు చెందిన చొరబాటుదారుడిగా గుర్తించిన నసీర్ మొల్లా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇతడిని బంగ్లాదేశీయుడిగా అనుమానించిన బెంగాల్ పోలీసులు జూన్‌లో అదుపులోకి తీసుకున్నారు.
నసీర్ మొల్లా ప్రస్తుతం డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడు. ఆయన తరుఫు బంధువులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నసీర్ భారతీయుడే అని ఆయన తరుఫు న్యాయవాది వాదించాడు. అయితే, విచారణలో భారత పౌరసత్వాన్ని చూపించే పత్రాలు సమర్పించాలని కోర్టు ఆదేశించగా, భూమి రికార్డులు తప్పా ఇతర ఆధారాలు లేవని పిటిషనర్ తరుఫు న్యాయవాది తెలిపారు.
Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
దీనిపై స్పందించిన కోర్టు.. ‘‘భూమి రికార్డులు భారత పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలు కావు. విదేశీయులు భారతదేశంలో స్థిరాస్తి కొనుగోలు చేయవచ్చు, ఆస్తి కొనుగోలు చేసినంత మాత్రాన భారతీయ పౌరసత్వం లభించదు’’ అని పేర్కొంది. నసీర్ మొల్లాకు మరో అవకాశం ఇస్తూ, జూలై 20లోగా పౌరసత్వాన్ని నిరూపించే ఇతర పత్రాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది.
గత నెలలో కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్టు మాత్రమే పౌరసత్వానికి తుది ఆధారం కాదని స్పష్టం చేసింది. అది కేవలం ట్రావెట్ డాక్యుమెంట్ మాత్రమే అని చెప్పింది. కొన్ని సందర్భాల్లో భారతీయులు కాని వారికి కూడా పాస్‌పోర్టు జారీ చేసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే అంశంపై 2013లో బాంబే హైకోర్టు కూడా పాస్‌పోర్టు కలిగి ఉండటం మాత్రమే భారత పౌరసత్వాన్ని నిరూపించే ఆధారం కాదని తీర్పు చెప్పింది.
తాజావార్తలు
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..