విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి నామినేషన్ వేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్లొన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన బస్సు యాత్రకు విశేషమైన స్పందన లభించిందన్నారు.
విశాఖ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతీ నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ.. ప్రతీ ఇంటికి వెళుతున్నారు. ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. నేనున్నాంటూ హామీ ఇస్తున్నారు. ఈ క్రమంలో.. అవంతి శ్రీనివాస్ తరుఫున బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్న రావాలి.. జగనన్న కావాలన్నారు. సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి అందాలంటే.. అభివృద్ధి ప్రతి ప్రాంతంలో జరగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.
మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం జగన్ సున్నా వడ్డీతోని ప్రతి అక్కచెల్లమ్మలకు లక్షలాది రూపాయలను అందించారు.. వీటితో పాటు చేయూత, ఆసరా, కాపూ నేస్తంతో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మేర తోడుగా అన్నతమ్ముడిలాగా ఈ నాలుగు సంవత్సరాల 10 నెలల కాలంలో సీఎం జగన్ ఒక్కరికి 90 వేల రూపాయలను నేరుగా వారి అకౌంట్లోకి వేశారని తెలిపారు.