Sridevi Birth Anniversary Special : అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. 80లలో అగ్ర నటిగా ఓ వెలుగు వెలిగింది. శ్రీదేవి తన కెరీర్లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను అందించింది. తన నటనతో ప్రేక్షకులను ముగ్ధులను చేసింది. ఆమె అందానికి ప్రేక్షకులు గుండెల్లో గుడి కట్టి.. తనను ఆరాధించేవారు. తన కెరీర్లో ఎన్నో రకాల పాత్రలు షోషించింది. అర్థాంతరంగా లోకాన్ని విడిచి వెళ్లింది. మహానటి శ్రీదేవి జయంతి నేడు. ఈ సందర్భంగా శ్రీదేవికి ఏం నచ్చిందో, ఫ్యామిలీ టైమ్‌ని ఎలా గడపడానికి ఇష్టపడిందో తెలుసుకుందాం.
బాలీవుడ్ ముద్దుల నటి శ్రీదేవిని ఇప్పటికీ ఆమె అభిమానులు మరచిపోలేదు. ప్రస్తుతం తాను ఈ లోకంలో లేదు. ఆమె బతికి ఉంటే ఈరోజు తన 60వ పుట్టినరోజు జరుపుకునేది. తన కుమార్తెలు జాన్వి, ఖుషి తన కళ్ల ముందు అరంగేట్రం చేయడాన్ని చూసి ఎంతో ఆనందపడి ఉండవచ్చు.
శ్రీదేవికి ఫిట్‌నెస్ అంటే చాలా ఇష్టం
ఎప్పుడూ 16ఏళ్ల వయసు టైంలో ఎలా ఉండేదో చనిపోయే నాటికి శ్రీదేవి అలానే ఉండేది. వయసు పెరుగుతున్న తరగని అందంతో ప్రేక్షకులను అలరించేది. ఆమెను చూస్తే ఎప్పుడూ కూడా తను 50+అంటే నమ్మశక్యంగా ఉండేది కాదు. ఐకానిక్ బ్యూటీ శ్రీదేవి అలా ఉండడానికి కారణం.. ఆరోగ్యకరమైన ఆహారం, ఫిట్‌నెస్. ఆసియా స్పా మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆమె ఒకప్పుడు తాను ఎప్పుడు యవ్వనంగా ఉండేందుకే ఇష్టపడుతున్నట్లు చెప్పింది. తాను ఫిట్‌గా ఉండటానికి, స్లిమ్ బాడీని మెయింటైన్ చేయడానికి ఇష్టపడుతుంది. ఇందుకోసం ఆమె జాగింగ్, యోగా చేసేది. అలాగే ఆమె తన పిల్లలతో టెన్నిస్ ఆడటానికి ఎక్కువగా ఇష్టపడేది.
లేడీ అమితాబ్
శ్రీదేవి తన కెరీర్‌లో పలు భాషల్లో ఎన్నో వందల సినిమాల్లో నటించింది. అభిమానులు తన సినిమా రిలీజ్ అయిందంటూ ఆమెను చూసేందుకు తహతహలాడేవారు. ‘నాగీనా’, ‘జుదాయి’, ‘చాందిని’, ‘మిస్టర్ ఇండియా’ వంటి కొన్ని చిత్రాలలో తన అద్భుతమైన నటనకు జనాలు నీరాజనం తెలిపారు. హిందీ చిత్రసీమలో ఆమెను ‘లేడీ అమితాబ్ బచ్చన్’ అని పిలిచేవారు. తను చనిపోయే కొన్ని నెలల ముందు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ‘మామ్’, ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రాల్లో నటించి చాలా కాలం పాటు తెరకు దూరమైనా తన ప్రతిభ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. తన నటన, అందంతో ప్రజల గుండెల్లో గూడుకట్టుకుపోయింది. మరో వందేళ్లపాటు శ్రీదేవి అలా చిరస్థాయిగా నిలిచిపోతుంది.
పిల్లలంటే ప్రాణం
తన భర్త, పిల్లలతో గడపడం తనకు చాలా ఇష్టమని శ్రీదేవి ఒకసారి చెప్పారు. తన పిల్లల సంతోషాన్ని చూసి ఆమె సంతోషించింది.
తల్లి మరణం తర్వాత జాన్వీ తెరంగేట్రం
శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న మరణించింది. అదే సంవత్సరం జూలైలో తన పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ‘ధడక్’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. జాన్వీ ఇప్పటికీ తన తల్లిని గుర్తుంచుకుంటుంది. జాన్వీ శ్రీదేవి ఫోటోను తన అభిమానులతో పంచుకున్న సందర్భాలు, ఆమె తన తల్లిని ఎంతగా మిస్ అవుతున్నానో పంచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. జాన్వీ సినిమా రంగంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తయింది. ఇప్పుడు చెల్లెలు ఖుషీ కపూర్ కూడా తన నటనా రంగ ప్రవేశానికి సిద్ధమైంది. ఈ సంవత్సరం OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న జోయా అక్తర్ చిత్రం ‘ది ఆర్చీస్’తో ఆమె అరంగేట్రం చేస్తుంది.