Sridevi: అందాల అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలగలిపిన రూపం ఆమెది. పాత్ర ఏదైనా.. హీరో ఎవరైనా శ్రీదేవి హీరోయిన్ అంటే.. బొమ్మ బ్లాక్ బస్టర్ అని నమ్మేవారు. బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఆమె ఎదిగిన తీరు ఎంతో ఆదర్శప్రాయం.
Sridevi Birth Anniversary Special : అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. 80లలో అగ్ర నటిగా ఓ వెలుగు వెలిగింది. శ్రీదేవి తన కెరీర్‌లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను అందించింది.
అందాల అభినేత్రిగా జనం మదిలో నిలచిపోయిన శ్రీదేవి అంటే ఇప్పటికీ అభిమానులకు ఓ ఆనందం, ఓ అద్భుతం, ఓ అపురూపం. శ్రీదేవికి మాత్రమే ఎందుకంత ప్రత్యేకత! ఆమెలాగే బాల్యంలోనే నటించి, తరువాత కూడా నాయికలుగా రాణించిన వారు ఎందరో ఉన్నారు. అయినా, శ్రీదేవి ఓ స్పెషల్!? నిజమే, శ్రీదేవిలాగే బాలనటిగానూ, తరువాత నాయికలుగానూ మురిపించిన వారు ఎందరో ఉన్నారు. అయితే ఎవరి సరసనైతే తాను మనవరాలుగా, కూతురుగా, చెల్లెలుగా నటించిందో సదరు హీరోలతోనే నాయికగానూ శ్రీదేవి మురిపించడం…