తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్కు షాక్లు మీద షాకులు తగులుతున్నాయి. రాష్ట్రంలో పలువురు బీఆర్ఎస్ నేతలు, నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ క్రమంలో.. నల్లగొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇంటి నిర్మాణం కోసం ముగ్గుపోయాలంటే వారికి ముడుపులు చెల్లించాల్సీందే. ముడుపు ముట్టజెప్పకపోతే ముప్పుతిప్పలు తప్పవు మరి. పిల్లర్ల ఎత్తును బట్టి వసూల్ రాజాలు రేటు ఫైనల్ చేస్తారు. అడిగినంత ఇవ్వకపోతే ఆగమాగమే. బీపాస్ లో దరఖాస్తు చేరితే చాలు సంబరాలు చేసుకుంటున్నారట ఆ వసూల్ రాజాలు.. అక్కడ ఇల్లుకట్టుకొవాలంటే మున్సిపాలిటీ అనుమతి కంటే ఆనేతల అనుమతే ముఖ్యంగా మారింది. నల్లగొండ పట్టణంలో ఇంటి నిర్మాణాలకు బీపాస్ లో దరఖాస్తు చేసుకుని నిబంధనల ప్రకారం అనుమతులు ఉంటే సరిపోదు.…