యాదాద్రి పేరును మారుస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యాదాద్రి బదులు యాదగిరిగుట్టగా పేరు మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇకపై యాదాద్రి బదులు అన్ని రికార్డుల్లో యాదగిరి గుట్టగా మార్చాలని సీఎం ఆదేశం ఇచ్చారు. ఇక నుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
స్పెయిన్ స్టార్ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ గురువారం టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సుదీర్ఘ కెరీర్‌కు స్పెయిన్ బుల్ గుడ్ బై చెప్పాడు. గాయాలతో వేగలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నాదల్ ప్రకటించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో నాదల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించాడు. అందులో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. రోజర్ ఫెదరర్, ఆండీ రాడిక్, లీటన్ హెవిట్.. వంటి దిగ్గజాలు టెన్నిస్‌ను ఏలుతున్న రోజుల్లో నాదల్ అరంగేట్రం చేసి సత్తా చూపించాడు.
భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ సోమవారం క్రీడలకు రిటైర్మెంట్ ప్రకటించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో దీపా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన దీపా.. స్వల్ప తేడాతో కాంస్య పతకాన్ని కోల్పోయింది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారతదేశపు తొలి మహిళా జిమ్నాస్ట్‌గా 31 ఏళ్ల దీపా నిలిచింది. కాగా.. రియో ఒలింపిక్స్‌లో వాల్ట్ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచి కేవలం 0.15 పాయింట్ల తేడాతో కాంస్య పతకాన్ని కోల్పోయింది.
భారతదేశం-రష్యాల జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్.. తమ కంపెనీలో కనీసం 15 శాతం టెక్నికల్ పోస్టులను అగ్నివీరుల కోసం రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా.. అనేక సంస్థల్లో అగ్నివీరులకి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. అయితే ఒక ప్రైవేట్ సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. టెక్నికల్ పోస్టులే కాకుండా అడ్మినిస్ట్రేటివ్, సెక్యూరిటీ అవసరాలకు అనుగుణంగా అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తామని బ్రహ్మోస్ తెలిపింది.
బంగ్లాదేశ్తో జరగనున్న తొలి టెస్టుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 21 నెలల తర్వాత రిషబ్ పంత్ మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చాడు. కేఎల్ రాహుల్కు కూడా స్థానం లభించింది. అలాగే యంగ్ అండ్ డాషింగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్కు జట్టులో చోటు దక్కింది. శ్రేయస్ అయ్యర్ను పక్కన పెట్టారు. మరోవైపు.. బౌలర్ యశ్ దయాళ్ను కూడా అదృష్టం వరించింది.
బీసీసీఐ (BCCI) టీమిండియా హోమ్ సీజన్ షెడ్యూల్ ప్రకటించింది. 2024-25 దేశవాళీ సీజన్లో.. భారత క్రికెట్ జట్టు 3 జట్లతో 5 సిరీస్లు ఆడనుంది. అందులో రెండు టెస్ట్ సిరీస్లు, రెండు టీ20 సిరీస్లు, ఒక వన్డే సిరీస్ ఉన్నాయి. ఈ క్రమంలో.. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు భారత్ లో పర్యటించనున్నాయి. ఇండియా స్వదేశ షెడ్యూల్ సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభమవుతుంది. బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్తో పాటు మూడు టీ20ల సిరీస్ భారత్ ఆడనుంది.…
ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక ప్రకటన చేసింది. యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ ను కెప్టెన్ గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించి ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇటీవల గాయం నుంచి కోలుకున్న పంత్ కు NCA క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఐపీఎల్ సమయానికి జట్టులో చేరుతాడని అందరూ అనుకున్నప్పటికీ, కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పజెప్పింది యాజమాన్యం. అయితే.. ఈ సీజన్ లో పంత్ వికెట్…
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మే 13న అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్ సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ విడుదల చేసింది. ఈసీ ప్రకటనతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తాజాగా.. మల్కాజిగిరి, ఆదిలాబాద్ ఎంపీ స్థానాలను అభ్యర్థులను వెల్లడించారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేయగా.. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆత్రం సక్కు పేరును గులాబీ బీస్ ప్రకటించారు. ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం అభ్యర్థులను ప్రకటించారు.