మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణకాశీగి పేరుగాంచిన వేములవాడ శ్రీరాజారాజేశ్వర స్వామి వారిని తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. వేములవాడను సీఎం కేసీఆర్ కావాలనే పక్క ప్లాన్ ప్రకారం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. కొండగట్టు వరకూ వచ్చిన సీఎం కేసీఆర్ వేములవాడకు రాకపోవడం నిధులు ప్రకటించక పోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు వేములవాడ రాజన్న శాపం తగులుతుందని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ పాలన పోవాలి అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. వేములవాడ రాజన్న పేదల దేవుడని, కేసీఆర్ హిందూ ద్రోహి పేదల ద్రోహి అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Automatic Sperm Extractor : ఇక వాటితో పనిలేదు.. అంతా మిషనే
వేములవాడలో ఏటా 100 కోట్లు ఇక్కడ నుంచి తీసుకుంటుంది ప్రభుత్వమని, ఇక్కడి డబ్బులు ఇక్కడే ఖర్చు చేసినా అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. వేములవాడకు లక్షలాదిగా భక్తులు వేస్తే ఏర్పాట్లు తూతూ మంత్రంగా చేశారని ఆయన మండిపడ్డారు. కనీసం నీళ్ళు కూడా లేవని, శివుడు పేద భక్తులు ఏం పాపం చేశారని, శివునికే శఠగోపం పెట్టావు అని ఆయన అన్నారు. వేములవాడను ప్రసాదం స్కీమ్ లో చేర్చాలని లేఖ రాస్తే మోడీకి పేరు వస్తుందని పట్టించుకోలేదని బండి సంజయ్ వెల్లడించారు.
Also Read : GST Council Meeting: ముగిసిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్.. ఈ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు..