Automatic Sperm Extractor : సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్తున్నామంటే మనుషులతో సంబంధం లేకుండానే అన్ని పనులు మిషన్లే కానిచ్చేస్తున్నాయి. కొత్త టెక్నాలజీలు వైద్యశాస్త్రంలో నూతన ఒరవడిలను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ చైనీస్ కంపెనీ ఓ అద్భుత ఆవిష్కరణ గావించింది. ప్రస్తుతం సంతాన సమస్య అనేది పలువురిని తీవ్రంగా వేధిస్తోంది. మారిన జీవనశైలి, పని ఒత్తిడి, డబ్బు కోసం విరామం లేకుండా శ్రమించడం వల్ల మనిషి సంతానోత్పత్తిలో వెనుకబడుతున్నాడు. ఈ క్రమంలో ఐవీఎఫ్ చేయించుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇందులో స్పెర్మ్ డొనేషన్ కోసం హస్తప్రయోగం చేయడం చాలా మంది ఇబ్బందికరంగా భావిస్తుంటారు. అలాంటి వ్యక్తుల విషయంతో హస్తప్రయోగాన్ని సులభతరం చేయడానికి ఒక చైనీస్ ఆసుపత్రి ‘ఆటోమేటిక్ స్పెర్మ్ ఎక్స్‌ట్రాక్టర్’ టెక్నాలజీని రూపొందించింది.
Read Also: Home Loan Comparison : ఏ బ్యాంకు తక్కువ వడ్డీకి హోం లోన్ ఇస్తుందంటే..
ఇది ఎలా పనిచేస్తుందంటే ‘ఎఫర్ట్‌లెస్’ మెషీన్‌లో మసాజ్ పైప్ ఉంటుంది. ఇది వినియోగదారు ఎత్తుకు అనుగుణంగా సర్దుబాటు చేయబడుతుంది. ఇది ప్రేరణ లేనివారి కోసం చిన్న స్క్రీన్‌తో అమర్చబడింది. దీన్ని ఉపయోగించే వ్యక్తి ప్రక్రియను ప్రారంభించే ముందు ఫ్రీక్వెన్సీ, వ్యాప్తి , ఉష్ణోగ్రతను మాన్యువల్‌గా సర్దుబాటు చేయాలి. శాస్త్రవేత్తలు ఈ యంత్రం సాయంతో చాలా సక్సెస్ అయ్యారు. అంతే కాకుండా IFL సైన్స్ ప్రకారం, పాత పద్ధతిలో ఇబ్బందికరంగా భావించే వ్యక్తుల కోసం ఈ పరికరం తగినట్లుగా తయారు చేయబడిందని ఆసుపత్రి యూరాలజీ విభాగం పేర్కొంది. ఈ విచిత్రమైన ఆవిష్కరణ ప్రజలను బాగా ఆకర్షిస్తోంది.
A Chinese company says its automatic sperm extractor is helping clinics collect semen from donors reluctant to masturbate in a hospital setting. pic.twitter.com/zBqf4wWVQi
— ManSitChoAzzDown (@AngryManTV) April 5, 2019