Lucknow Horror:14 ఏళ్ల బాలికపై బాలుడి అత్యాచారం.. ఆపై సుత్తితో కొట్టి, ఫ్యాన్‌కు ఉరేసి.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucknow Horror: నేటి తరం సమాజంలో వస్తున్న మార్పులను చూస్తే చాలా మంది భయంతో వణికిపోతున్నారు. అత్యాచారాలు, హత్యలు చేస్తూ సమాజాన్ని చెడు దారికి మార్గం చూపిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా వావి వరసలు మరిచి అత్యాచారాలు చేస్తూ దారుణాలకు తెగబడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఇలాంచి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. లక్నోలోని ఇందిరా నగర్‌లో గురువారం ఓ బాలుడు 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, సుత్తితో కొట్టి చంపాడని పోలీసులు తెలిపారు.
నిందితుడు గురువారం మధ్యాహ్నం 1:00 నుంచి 1:30 గంటల మధ్య తక్రోహిలోని బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడి చేసి సుత్తితో కొట్టి చంపేశాడు. ఇంటి నుండి పారిపోయే ముందు, ఆమె మృతదేహాన్ని ఆమె గదిలో ఫ్యాన్‌కు ఉరివేసాడు. నిందితుడిని షాహిద్‌గా గుర్తించారు, అతడికి బాధితురాలితో సంబంధం లేదా హత్యకు గల కారణాలు ఇంకా నిర్ధారించబడలేదు. బాధితురాలి తల్లిదండ్రులు జీవనోపాధి కోసం బట్టలు ఇస్త్రీ చేసి, వారి దుకాణానికి వెళ్లిన సమయంలో నిందితుడు వారి ఇంట్లోకి ప్రవేశించి ఈ నేరానికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. “నా భార్య ఇంటికి తిరిగి వచ్చి, వరండాలో నిలబడి ఉన్న షాహిద్‌ను చూసింది, ఆమె అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అతను ఆమెను తోసివేసి పారిపోయాడు.” అని చెప్పారు. తలకు గాయం కావడంతో బాలిక మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రూరమైన నేరం స్థానిక సమాజంలో ఆగ్రహాన్ని రేకెత్తించింది, బాధితురాలికి త్వరగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Also Read: Viral Video: మేకల మందపై కోతి ఫీట్లు.. బాహుబలి-2 ఫైట్ సీన్ రిపీట్..!
ముంబై సమీపంలోని మీరా రోడ్డులో లైవ్-ఇన్ భాగస్వామి హత్య కేసుపై దేశం ఇప్పటికే షాక్‌లో ఉన్న రోజునే ఈ దారుణం జరగడం గమనార్హం. ముంబై సమీపంలోని మీరా రోడ్ ప్రాంతంలో తన 32 ఏళ్ల లైవ్-ఇన్ పార్ట్‌నర్ సరస్వతి వైద్యను హత్య చేసి, రెండు కట్టర్‌లతో ఆమె శరీరాన్ని 20కి పైగా ముక్కలు చేసి, భాగాలను ఉడకబెట్టినందుకు 56 ఏళ్ల మనోజ్ సానేను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. హృదయ విదారకమైన ఈ ఘటనను చూసి పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన ముంబైకి ఆనుకుని ఉన్న మీరా రోడ్‌లోని నయానగర్ ప్రాంతానికి చెందినది. నిందితుడు గత 3 సంవత్సరాలుగా మోంజ్ సరస్వతి అనే అమ్మాయితో లివ్ ఇన్ రిలేషన్షిప్‌లో జీవిస్తున్నాడు. ఈ సంఘటన ఆకాష్‌దీప్ సొసైటీకి చెందినది. సమాచారం ప్రకారం, కొన్ని రోజుల క్రితం వారిద్దరూ ఏదో విషయంలో గొడవ పడ్డారు. దీంతో విషయం ఎంతగా పెరిగిందంటే మనోజ్ కోపంతో సరస్వతిని చంపేశాడు. దీని తర్వాత, అతను సాక్ష్యాలు దొరకకుండా చేయడానికి ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి, ఆపై వాటిని ప్రెషర్ కుక్కర్లో ఉడికించాడు. అయితే హత్య వెనుక అసలు కారణం ఏంటనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం దొరకలేదు.
తాజావార్తలు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!