అండర్ ఆర్మ్ చెమటను తగ్గించేందుకు ముఖ్యంగా పరిశుభ్రంగా ఉండటం చాలా చాలా అవసరం. దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి మీ అండర్ ఆర్మ్స్ ను యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో క్రమం తప్పకుండా కడగండి. అంతేకాకుండా స్నానం చేసిన తర్వాత మీ చంకలను బాగా ఆరబెట్టుకోవాలి. మరోవైపు డియోడరెంట్ల కంటే యాంటిపెర్స్పిరెంట్లను ఎంచుకోవడం మంచిది.