ప్రస్తుత కాలంలో ఉన్నోడి, లేనోడి లక్ష్యం ఒకటే డబ్బు సంపాదన. డబ్బు సంపాదించాలనే ఆరాటంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. టైముకు తినకపోవడం, సరియైన నిద్ర లేకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం కూడా కారణమవుతోంది. పోషకాహారాలు, ఔషద గుణాలున్న పానియాలు ఆహారంలో చేర్చుకుంటే వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు. వాటిలో తేనె ఒకటి. ఆయుర్వేదంలో తేనెను ఔషధంగా పరిగణిస్తారు. తేనె అందాన్ని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా…
రాను రాను మానవ జీవన విధానం మారుతోంది. ఇది మనిషి జీవనశైలి, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం చూపుతోంది. ఇప్పుడు వయసులో ఉన్న చాలా మంది యువకులకు కనీసం సత్తువ తక్కువవుతోంది. మన తాతల కాలంలో ఒంటి చేస్తో 50 కేజీల వడ్ల బస్తా మోసే వాళ్లు. అలాంటి పరిస్థితి ఇప్పటి జనరేషన్ వాళ్లలో కనిపించడం లేదు. కాగా.. అయిదు పదుల వయసులు ఓ మహిళ సంచలనం సృష్టించింది.
ఆధునిక జీవన శైలిలో భాగంగా రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం, ఉదయం పొద్దెక్కేదాకా నిద్రలేవక పోవడం మామూలు వ్యవహారమైపోయింది. కొందరు వృత్తిరీత్య ఆలస్యంగా నిద్రిస్తే మరికొందరు రాత్రిళ్లు సరదాగా తిరుగుతూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. వీరు ఉదయం లేచే సరికి మధ్యాహ్నం కావడంతో టిఫిన్ తినడం కుదరదు. కొందరు ఉదయం హడావిడిగా ఆఫీసులకు వెళ్లే క్రమంలో అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.
అన్ని వయసుల వ్యక్తులు తమ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఆరోగ్యకరమైన శరీరం ఉంటే ఏమైనా సాధించగలం. వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఒక నిర్దిష్ట వయసు తర్వాత శరీరం బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. వయసు సంబంధిత వ్యాధులు పెరుగుతాయి. ఎవరి జీవితంలోనైనా 60 ఏళ్ల వయస్సు చాలా ముఖ్యమైన దశ.
Health Benefits: ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అందరికీ శ్రద్ద పెరిగింది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆయుర్వేద మార్గాల కోసం చూస్తున్నారు.
భారతదేశం పండుగలకు నిలయం. మరికొన్ని రోజుల్లో వెలుగులు, ఆనందాల మాధుర్యంతో దీపావళి పండుగ రాబోతోంది. ఈ పండుగ నాడు ప్రజలు మిఠాయిలు పంచుకుంటారు. అయితే ప్రతి ఏటా కల్తీ మిఠాయిలు తిని అనారోగ్యానికి గురవుతున్నారనే వార్తలు పండుగ మజాను పాడుచేస్తున్నాయి. పండుగ సీజన్‌లో ఏయే వస్తువులు కల్తీ అవుతాయి? ఎలా గుర్తించాలనే అంశాలను తెలుసుకుందాం
ప్రస్తుత రోజుల్లో కిడ్నీలో రాళ్లు ఉండడం కామన్ సమస్యగా మారింది. అయితే.. దీన్ని సీరియస్‌గా తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. కిడ్నీ శరీరంలోని చాలా ముఖ్యమైన అవయవంలో ఒకటి. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి పనిచేస్తుంది.
భారతదేశంలో వైవాహిక జీవితాన్ని బండితో పోల్చారు. ఇందులో భార్యాభర్తలు బండి చక్రాలుగా ఉంటారు. ఒక చక్రం విరిగిపోయినా.. ఈ వైవాహిక జీవితం ముందుకు సాగదు. భార్యాభర్తల మధ్య బంధం ఎంత పటిష్టంగా ఉంటే అంత సున్నితంగా ఉండడానికి ఇదే కారణం.
చాలా మంది అమ్మాయిలు తమ అత్తమామలు తమతో కలిసి జీవించాలని కోరుకుంటారు. కానీ అడ్జస్ట్ మెంట్ వల్లనో, ఇతర కారణాల వల్లనో గొడవల వల్ల ఇంట్లో వాతావరణం చెడిపోతుంది.
టాటా సన్స్ చైర్మన్ రతన్ నావల్ టాటా ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. రతన్ టాటా నిజాయితీపరుడు, నైతికత, పరోపకారం కలిగిన వ్యక్తి. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా.. విజయం సాధించారు. ఆయన పెళ్లి చేసుకోలేదు. కానీ పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులకు ఆయన గొప్ప సూచనలు చేశారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు అత్యుత్తమ విద్యను అందిస్తారు. డబ్బు సంపాదించి ధనవంతులు కావడమే దీని వెనుక లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాంటి తల్లిదండ్రులలో మీరు కూడా ఉన్నట్లయితే..…