వయసు పెరిగే కొద్దీ కీళ్లు, ఎముకల నొప్పుల సమస్యలు అధికమవుతాయి. 50 ఏళ్లలోపు వ్యక్తులలో కూడా ఆర్థరైటిస్ ప్రమాదం పెరుగుతుంది. ఈ సమస్య కారణంగా.. నడవడం, సాధారణ పనులు చేయడం కష్టమవుతుంది. కీళ్ల నొప్పులు.. పురుషులు, మహిళలు ఇద్దరికీ వస్తాయి. మహిళలకు గర్భధారణ, రుతువిరతి సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా మహిళలకు కీళ్ల నొప్పుల సమస్య వచ్చే అవకాశ ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.
భారతదేశంలో 60 ఏళ్లు పైబడిన ప్రతీ ముగ్గురిలో ఒకరు ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. 20, 30 సంవత్సరాల వయస్సులో వారికి కూడ ఈ సమస్య పెరుగుతోంది. అందుకు కారణం.. జీవనశైలి పాడైపోయిన తీరు వల్ల కీళ్లు, ఎముకల సమస్యలు ఎక్కువవుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి అలవాట్లు కూడా ఈ సమస్యకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలో.. చిన్న వయస్సు నుండే ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. చిన్నప్పటి నుంచే పౌష్టికాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. కీళ్ల నొప్పులు, వాపులు, ఆర్థరైటిస్ సమస్యలను తగ్గించడంలో కూడా కొన్ని ఇంటి నివారణలు సహాయపడతాయి. ఆ రెమెడీలు ఏంటో తెలుసుకుందాం.
Heavy Rains in AP: కృష్ణా నదీ పరివాహక ప్రాంత రైతులను అప్రమత్తం చేసిన వ్యవసాయ శాఖ
హాట్ అండ్ కోల్డ్ ఫోమెంటేషన్:
హాట్ అండ్ కోల్డ్ ఫోమెంటేషన్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగిస్తుంది. వేడి నీటి బ్యాగ్ (హీట్ ప్యాడ్) లేదా వేడి టవల్ ఉపయోగించి కీళ్లకు వేడిని వర్తింపజేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. అలా.. నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా కీళ్లపై ఐస్ బ్యాగ్స్‌ను అప్లై చేయడం ద్వారా వాపు, నొప్పి తగ్గుతాయి. ఆర్థరైటిస్ రోగులు డాక్టర్ సలహా మేరకు ఈ రెమెడీని క్రమం తప్పకుండా వాడాలి.
ఆహారంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ విషయాలు చేర్చాలి..
ఆహారంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ విషయాలు చేర్చడం వల్ల కీళ్లలో వాపు తగ్గుతుంది. పసుపు, అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇవి వాపు, నొప్పిని తగ్గిస్తుంది. అదేవిధంగా అల్లం కూడా వాపును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కీళ్లనొప్పులు ఉన్నవారు రోజూ ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక చెంచా పసుపు కలిపి తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
యోగా, వ్యాయామం ముఖ్యం..
క్రమం తప్పకుండా లైట్ లెవెల్ ఎక్సర్ సైజ్, యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది కీళ్లలో వశ్యతను పెంచడంలో.. నొప్పిని తగ్గించడంలో తోడ్పడుతుంది. అలాగే.. స్విమ్మింగ్, నడక వంటి వ్యాయామాలు కూడా మంచిది. ఎక్కువ సేపు కూర్చోవడం మానుకోండి.. కీళ్లనొప్పులు ఉన్న వారికి రోజూ వాకింగ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.