Train Incident: రైల్వే ప్లాట్‌ఫారమ్‌ల పైకి వెళ్లేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరిపోదు. మన దృష్టి పూర్తిగా రైళ్లపై, రైల్వే ప్లాట్‌ఫారమ్ లపై ఉండటం చాలా ముఖ్యం. తాజాగా ఓ రైలు ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో ఫుటేజ్‌లో, ఒక మహిళ తన చేతుల్లో శిశువును పట్టుకుని రైల్వే ప్లాట్‌ఫారమ్ పై తన స్నేహితులతో కలిసి ఫోన్‌లో మాట్లాడుతూ నడుస్తోంది. మొబైల్ సంభాషణలో బిజీగా ఉన్న ఆమె రైలు వైపు చూడకుండా రైలు పట్టాలు దాటడానికి వెళ్ళింది. అప్పటికే వెనుక నుంచి వస్తున్న రైలు ఆమెను ఢీకొట్టింది. దాంతో ఆమె, చేతిలో ఉన్న చిన్నారి రైలు ఢీకొనడంతో ఒక్కసారిగా వారిద్దరూ గాలిలోకి ఎగిరి ప్లాట్‌ఫారమ్‌పై పడిపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వెనుక నుంచి రైలు తన వైపు వస్తోందని ఆమె తెలియక నడుచుకుంటూ వెళుతుండగా.., ప్రమాదం జరిగింది.
Hyderabad Metro: మెట్రో ఎక్స్ అకౌంట్ హ్యాక్.. యాజమాన్యం కీలక సూచన..
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆ స్టేషన్ లోని సీసీటీవీలో రికార్డైంది. ఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు సాయం చేసేందుకు పరుగులు తీయడం వీడియోలో కనిపిస్తోంది. మహిళ, చిన్నారి పరిస్థితి ఇంకా పూర్తిగా తెలియరాలేదు. కాబట్టి రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై లేదా రోడ్లపై ముఖ్యంగా పిల్లలతో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త చర్య విపత్తుకు దారి తీస్తుంది. కాబట్టి దాటే ముందు ఒకటికి రెండు సార్లు దారిలో వాహనం రాకుండా చూసుకోవాలి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. పిల్లాడితో ఉన్నపుడు అలర్ట్ గా ఉండాలంటూ మహిళా పై నెటిజన్స్ మంది పడుతున్నారు. అయితే ఈ ఘటన భారతదేశంలో మాత్రం కాదని వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
— Horror Mistake (@Horror_clip) September 16, 2024