Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు చూస్తూనే ఉంటాము. అయితే అందులో కంటెంట్ ఉన్న వీడియోలు మాత్రమే వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. ఇలా ఎక్కువగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు, అలాగే అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువ వైరల్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే తాజాగా కొందరు ఆఫ్రికన్ ఖండం సంబంధించిన పిల్లల వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో గురించి పూర్తి వివరాలు చూస్తే..
AUS vs ENG: మరోసారి ట్రావిస్ హెడ్ దూకుడు ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా విజయం..
వీడియో మొదలయినప్పటి నుండి చివరి దాకా పాప్ సింగర్ షకీరా ఆలపించిన వాక.. వాక.. పాటతో కొనసాగుతుంది. ఈ వీడియోలో మొదట ఫుట్ బాల్ ఆటలో భాగంగా ఓ అబ్బాయి తన తోటి ఆటగాళ్లను దాటుకుంటూ బాలును గోలుగా మలుస్తాడు. అయితే ఆ తర్వాత గోల్ సెలబ్రేషన్ నేపథ్యంలో అందరూ ఒక చోటికి చేరి డాన్స్ చేయడానికి ప్రిపేర్ అవుతారు. ఇక్కడే అసలైన కథ మొదలవుతుంది. ఆరు లేదా ఏడు సంవత్సరాల పిల్లాడిని ఇద్దరూ పిల్లలు చేతులతో పట్టుకొని పైకి ఎగరవేస్తారు. ఆ తర్వాత ఆ పిల్లాడిని ఓ తాడుల పైకి కిందకి ఊపుతూ అచ్చం స్కిప్పింగ్ తాడులా వాడుతారు. అలా ఆ పిల్లాడిని కిందకు పైకి ఊపుతున్న సమయంలో కొందరు పిల్లలు అతనిని దాటుకుంటూ స్కిప్పింగ్ చేసేలాగా చేయడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.
Family Suicide: ఇంట్లోనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య..?
పిల్లాడిని అలా చేస్తే ఏదైనా జరిగితే ఎలా అంటూ చాలామంది కాస్త ఆగ్రహిస్తుండగా.. మరికొందరేమో వారి ట్యాలెంట్ చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. పిల్లల టాలెంట్ సూపర్ అంటూ వారిని అభినందిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోని చూసి మీకేమనిపించిందో కామెంట్ తెలపండి.
వాడు మనిషి అనుకున్నారా లేక తాడనుకున్నారా pic.twitter.com/dEkmywMIcn
— మన తెలుగు (@manatelugumaata) September 19, 2024