Daughters Day 2024: భారతదేశంలో ప్రతి సంవత్సరం లాగానే, ఈ సంవత్సరం కూడా నేడు డాటర్స్ డే (కుమార్తెల దినోత్సవం) జరుపుకుంటున్నారు. ఇది ప్రతి ఏడాది సెప్టెంబర్ 22 జరుపుకుంటారు. కుమార్తెల దినోత్సవం అనేది కుమార్తెలు – తల్లిదండ్రుల మధ్య విడదీయరాని బంధాన్ని జరుపుకోవడమే కాకుండా.. సమాజంలో ఆడపిల్లలకు సమానమైన, గౌరవనీయమైన స్థానాన్ని కల్పించడం ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. భారతదేశంలో, ఆడపిల్లల పట్ల సమాజ వైఖరిలో మార్పు తీసుకురావడానికి, వారిని శక్తివంతం చేయడానికి ఈ రోజును జరుపుకుంటారు.
ENG vs AUS: మరోసారి చతికిలపడ్డ ఇంగ్లాండ్.. రెండో వన్డేలోనూ ఆస్ట్రేలియా విజయం..
కుమార్తెల దినోత్సవం లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం, కుమార్తెలకు కుమారులుగా సమాన హక్కులు, వారికి అవకాశాలను కల్పించడం ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. ఈ రోజు కుమార్తెలపై సామాజిక పక్షపాతాన్ని తొలగించి వారిని సానుకూల దృక్పథంతో చూడాలని ప్రోత్సహిస్తుంది. కూతుళ్లను చదివించడం, వారికి స్వాతంత్య్రం ఇవ్వడం, వారి కలలను నెరవేర్చడానికి వారిని ప్రేరేపించడం కోసం కుమార్తెల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు తల్లిదండ్రులు, వారి కుమార్తెల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి, ఒకరికొకరు దగ్గరయ్యే అవకాశాన్ని అందిస్తుంది.
Israel Air Strike : లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 37 మంది మృతి, 68 మందికి గాయాలు
భారతదేశంలో కుమార్తెల దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ముఖ్యమైనది. ఆడపిల్లల పట్ల సమాజంలోని దృక్పథంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఇటీవలి సంవత్సరాలలో ప్రభుత్వం, అనేక సంస్థలు కలిసి బేటీ బచావో, బేటీ పఢావో ప్రచారాలను నిర్వహించడం ద్వారా కుమార్తెల సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాయి. లింగ అసమానతలను తగ్గించి, అందరికీ సమాన అవకాశాలు లభించే సమాజాన్ని రూపొందించడంలో కుమార్తెల దినోత్సవం సహాయపడుతుంది. ఇది కుమార్తెలకు ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. కూతుళ్ల దినోత్సవం కుమార్తెలు చదువుకోవడానికి, వృత్తిని సంపాదించుకోవడానికి అలాగే వారి కలలను నెరవేర్చుకోవడానికి ప్రేరేపిస్తుంది. సాధికారత, విద్యావంతులైన స్త్రీ సమాజాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.