ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు మరోసారి సమ్మె బాట పట్టునున్నాయి. ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో విజయవాడ ఏపీ రెవెన్యూ భవన్‌లో శుక్రవారం ఏపీ ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి సభ్య సంఘాలతో పాటు, ఏపీజేఏసీ సభ్య సంఘాలు, ఏపీఎన్‌జీవో సంఘానికి చెందిన ముఖ్య నేతలు బండి శ్రీనివాసరావు, కేవీ శివారెడ్డి తదితర నాయకులు పాల్గొననున్నారు. మరో ప్రధానమైన ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎ్‌సఈఏ) నేతలు పార్థసారథి, రొంగలి అప్పల్రాజుతో పాటు సీఐటీయూసీ, ఏఐటీయూసీ అగ్రనేతలు కూడా హాజరు కానున్నారు. ఈ సంఘాలన్నీ ‘ఉమ్మడి కార్యచరణ’ దిశగా కదిలే అవకాశం కనిపిస్తోంది. ఐక్యపోరాటాల దిశగా అడుగులు వేయటానికి రౌండ్ టేబుల్ అత్యంత కీలకంగా మారబోతోంది.
Also Read : Unemployment protest: నిరుద్యోగ నిరసన సభ.. విద్యార్థులతో రేవంత్‌రెడ్డి సమావేశం
ఇదిలా ఉంటే.. నిన్న మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమావేశంలో సీపీఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్, డీఏ బకాయిలపై చర్చించామని తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన ఒక్కొక్క జీవోను వరుసగా విడుదల చేస్తామని చెప్పారు. ఉద్యోగుల బకాయిల్లో ఇప్పటికే 70 శాతం చెల్లించామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై చర్చించామని.. దాని అమలుకు స్పష్టమైన విధివిధానాలను రూపొందిస్తామని సత్యనారాయణ తెలిపారు. సీపీఎస్‌కు చట్టబద్ధత లేదన్న అంశంపై ఎవరో మాట్లాడితే తాను స్పందించలేనని స్పష్టం చేశారు.
Also Read : Delhi: ఆ భవనం మాకిచ్చేయండి.. ఏపీని కోరిన తెలంగాణ