AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి రోజు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగులు, పింఛనర్లకు దీపావళి కానుకను డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కూటమి సర్కార.. ఇక, గత ఏడాది అంటే 2024 జనవరి 1వ తేదీ నుంచి డీఏ అలవెన్స్‌ను 3.64 శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది. అంటే, డీఏ పెంపు 2024 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది…
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాలుగు పెండింగ్ డీఏలకు గాను ఒక డీఏను ఇవ్వబోతున్నట్లు పేర్కొనింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఉద్యోగులకు ఒక డీఏ ఇస్తున్నాం.. దీని కోసం ప్రతి నెలా రూ.160 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇక, ఒక డీఏ ప్రకటించడంపై ఉద్యోగ సంఘాల నేతలు స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ నేత విద్యా సాగర్ మాట్లాడుతూ..…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మున్సిపల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లుగా ఇతర శాఖల ఉద్యోగుల నియామకంపై విధివిధానాలు జారీ చేసింది... ఇతర శాఖల నుంచి ఎక్కువ మంది మున్సిపల్ శాఖకు వచ్చేందుకు ఆసక్తి చూపుతుండటంతో పలు నిబంధనలతో ఉత్తర్వులు జారీ చేసింది..
ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు.. దాదాపు 6,200 కోట్ల రూపాయాలు చెల్లించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఉద్యోగుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యబీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. తెలంగాణలోని ఆస్పత్రుల్లోనూ వైద్య సేవలు, చికిత్స పొందేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
సాధారణ బదిలీల నుంచి తప్పించుకునేందుకు పక్కదారి పడుతోన్నారు పలువురు ఉద్యోగులు. బదిలీల నుంచి వెసులుబాటు కోసం వివిధ సంఘాల నుంచి ఆఫీస్ బేరర్ల లెటర్లు తీసుకుంటున్నారట పలువురు ఉద్యోగులు. ఆఫీస్ బేరర్లు కాకున్నా కొన్ని ఉద్యోగ సంఘాలు లేఖలు ఇచ్చేస్తోన్నట్టు గుర్తించిన ప్రభుత్వం.. అనర్హులకు లేఖలు.. ఫేక్ ఆఫీస్ బేరర్ల లెటర్లపై సీరియస్ అయ్యింది..
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో బదిలీలు చేపట్టనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక, బదిలీల మార్గదర్శకాలపై తుది కసరత్తు జరుగుతోంది.. ఆఫీస్ బేరర్ల పేరుతో బదిలీలను తప్పించుకునేలా కొందరు వైసీపీ అనుకూల ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.. ఆఫీస్ బేరర్లకు తొమ్మిదేళ్ల పాటు బదిలీల నుంచి వెసులుబాటు కల్పించే జీవోను అడ్డం పెట్టుకుంటున్నారట పలువురు ఉద్యోగులు.
ఏపీలో జీపీఎస్ జీవో, గెజిట్ వెనక్కి తీసుకోవడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తు్న్నారు. గత ప్రభుత్వం వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన తరువాత మోసం చేసి జీపీఎస్ తెచ్చిందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.
ఏపీలో విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిందిగా ఉద్యోగులకు జీఏడీ నోటీసులు ఇచ్చారు. ఉచిత వసతి సౌకర్యం పొందుతున్న ఉద్యోగులు అదనంగా వినియోగించిన కరెంట్ ఛార్జీలను చెల్లించాలని జీఏడీ లేఖ రాసింది. ఆ లేఖలో.. సెక్రటేరీయేట్, హెచ్ఓడీల ఉద్యోగులకు కల్పించిన ఉచిత వసతి భవనాల్లో పరిమితికి మించి విద్యుత్ వాడుకున్నారని జీఏడీ ప్రస్తావించింది. రెయిన్ ట్రీ పార్క్, చిల్లపల్లి, నవులూరు, ఎమరాల్డ్ పార్క్, ఉండవల్లి, గొల్లపూడి వద్ద ఉద్యోగులకు కేటాయించిన అపార్టుమెంట్లలో అదనంగా విద్యుత్ వినియోగించుకున్నారని తెలిపింది.