CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ప్రభుత్వం తరఫున రైతులకు అండగా నిలుస్తామని ధైర్యాన్ని ఇస్తున్నారు. బాపట్ల జిల్లా పాత నందాయపాలెంలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇలాంటి పరిస్థితుల మధ్య రైతులను చూస్తుంటే బాధేస్తుందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మీకు ఏ కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని.. మీ చిరునవ్వుతో అది స్పష్టమవుతుందన్నారు. ఈ ప్రభుత్వం మీది అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ ప్రభుత్వంలో ఎవరికైనా మంచే జరుగుతుంది తప్ప ఏ ఒక్కరికి చెడు జరగదన్నారు. కోస్తా తీర ప్రాంతంలో అనేక గ్రామాలను అనేక ప్రాంతాలను ఈ తుఫాను ముంచేసిందని.. ఎన్నడూ చూడని భారీ వర్షాలు కురిశాయని సీఎం చెప్పారు.
Read Also: Onion Exports: వచ్చే ఏడాది మార్చి వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం..
మిగిలిన ఏ రాష్ట్రాల్లో లేనిది మన రాష్ట్రంలోనే ఉన్నది ఒక గొప్ప సచివాలయ వాలంటీర్ వ్యవస్థ అని.. ఈ వ్యవస్థ ద్వారానే ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా చేయి పట్టుకొని సహాయం చేసే కార్యక్రమం చేస్తున్నామన్నారు. వివక్షతకు తావు లేకుండా, మనకు ఓటు వేయని వారికి నష్టం జరిగినా వారికి తోడుగా ఈ ప్రభుత్వం ఉంటుందన్నారు. అత్యంత పారదర్శకతతో బాధితులను గుర్తించడం, వాళ్ళందరికీ ధైర్యం కల్పించడం ఈ ప్రభుత్వం బాధ్యత అని వెల్లడించారు. గత ప్రభుత్వాలు కరువు వచ్చినా, వరదలు వచ్చినా పట్టించుకునేవి కాదన్నారు. ఎప్పుడు ఇన్పుట్ సబ్సిడీ వస్తుందో , ఎంతమందికి సబ్సిడీ వస్తుందో ఎవరికీ తెలిసేది కాదని, కానీ గడిచిన నాలుగున్నర ఏళ్లుగా ఈ ప్రభుత్వం చరిత్రను మార్చేసిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బాధితులు ఎవరైనా సరే, రేషన్‌తో పాటు 2500 రూపాయలు ప్రతి బాధిత కుటుంబానికి ఇస్తున్నామన్నారు. పంట నష్టానికి సంబంధించి ప్రతి రైతన్న అపోహలు నమ్మొద్దు…. ఇన్సూరెన్స్ రాదని ,ఇన్పుట్ సబ్సిడీ రాదని చెప్తే, మాయమాటలు నమ్మొద్దన్నారు. నేను చెప్తున్నా మీరు ధైర్యంగా ఉండండి అంటూ సీఎం జగన్ అన్నదాతలకు ధైర్యం చెప్పారు. వచ్చే సంక్రాంతి లోపు ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీ మీ ఖాతాలో పడుతుందన్నారు సీఎం జగన్. 80 శాతం సబ్సిడీతో విత్తనాలు సప్లై చేస్తామన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ఇన్సూరెన్స్, వచ్చే ఖరీఫ్ ప్రారంభానికి ఇచ్చి తీరుతామన్నారు.
Read Also: GVL: ఏపీలో తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏ మాత్రం ఉండదు..
ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. “నేను చేస్తున్న యుద్ధం మారీచుడితో.. పనిగట్టుకుని మాయమాటలు చెబుతున్న వారితో ప్రచారం చేస్తున్న వ్యక్తులతో నేను యుద్ధం చేస్తున్నాను.. ప్రతి ఒక్క ఎకరాను ఈ క్రాప్‌లో నమోదు చేసి , రైతుల తరఫున కట్టాల్సిన ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.. దేశంలో ఇది మన రాష్ట్రంలోనే జరుగుతుంది.. చంద్రబాబు హయాంలో వరుసగా ఐదేళ్లు కరువు కాటకాలే అయినా 3400 కోట్ల రూపాయలు మాత్రమే ఇన్సూరెన్స్ వచ్చింది… గడిచిన నాలుగున్నర ఏళ్లుగా మన పాలన లో కరువు కాటకాలు లేకపోయినా, 7500 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా చెల్లిచ్చాం.. దేశంలో ఎక్కడా చూడని విధంగా , సీజన్ ముగిసే లోపు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.. పంట నష్టం జరిగిన ప్రతి రైతు పేరు సచివాలయాల్లో డిస్‌ప్లే చేస్తాం , ఎవరైనా రైతులు తమకు న్యాయం జరగలేదు అని భావిస్తే సచివాలయంలో ఫిర్యాదు చేసుకోవచ్చు.” అని సీఎం చెప్పారు.