ఈ నెల 17న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్‌కు సంబంధించి ఆయా శాఖల ప్రతిపాదనలను ఈనెల 16 సాయంత్రం నాలుగు గంటల లోగా అందించాలని సీఎస్ విజయానంద్ తెలిపారు. కేబినెట్ సమావేశాల్లో భాగంగా.. గీత కార్మికులకు మద్యం షాపులు, రేట్ పెంపుపై కేబినెట్లో చర్చిస్తారు. అంతేకాకుండా.. ఇతర కీలక అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.
Read Also: India weapon: ఈ భారత ఆయుధం అంటే చైనా, పాక్‌కి భయం.. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్..
మరోవైపు.. ఈనెల 2వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 14 కీలక అంశాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా 14 ఎంజెడా అంశాలపై ఏపీ కేబినెట్ సమావేశమవగా.. సుదీర్ఘంగా చర్చల అనంతరం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో రూ.2733 కోట్ల పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా.. పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
Read Also: Kamakshi Bhaskarla: అందాలతో పోరగాళ్ల మతి పోగొడుతున్న కామాక్షి భాస్కర్ల..