ఈ నెల 17న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్‌కు సంబంధించి ఆయా శాఖల ప్రతిపాదనలను ఈనెల 16 సాయంత్రం నాలుగు గంటల లోగా అందించాలని సీఎస్ విజయానంద్ తెలిపారు. కేబినెట్ సమావేశాల్లో భాగంగా.. గీత కార్మికులకు మద్యం షాపులు, రేట్ పెంపుపై కేబినెట్లో చర్చిస్తారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. గిరిజన ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
టీటీడీ పాలకమండలి నిర్ణయాలను చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5141 కోట్ల రూపాయల అంచనాతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్ కి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పీఏసీ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇదిలా ఉంటే.. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇంచార్జి మంత్రులను నియమించింది. 17 నియోజక వర్గాలకు 17 మంది మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రెండు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది పీఏసీ.
కోవిడ్ నియంత్రణ పై సమీక్షలో సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలి. అలాగే ఎంప్యానెల్ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలి అని తెలిపారు. అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలి. టెంపరరీ ఎంప్యానెల్ ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు ఇవ్వాలి. కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్ ఎంప్యానెల్ ఆస్పత్రులూ ఆ బెడ్లు ఇవ్వాలి. అందుకోసం ఆ ఆస్పత్రులను…