BrahMos: ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ నెలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు. 2025 భారత గణతంత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. అయితే, ఆయన ఈ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు. ఈ భేటీలో భారత అస్త్రం బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు గురించి కీలక ఒప్పందం చేసుకోబోతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఒప్పందం కుదిరితే రెండేళ్లలో బ్రహ్మోస్ క్షిపణిన భారత్ ఇండోనేషియాకు డెలివరీ చేయనుంది.
Read Also: Vijay Hazare Trophy: ఐపీఎల్‌లో అన్‌సోల్డ్ ప్లేయర్.. కట్ చేస్తే..! చితక్కొట్టుడే
భారత్, రష్యా కలిసి అభివృద్ధి చేసిన ఈ క్షిపణికి ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ ఈ క్షిపణిని కొనుగోలు చేసింది. ఇప్పుడు ఇండోనేషియా, వియత్నాంలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్‌లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్క్వా నదులుతో ఈ క్షిపణికి పేరు పెట్టారు.
ప్రస్తుతం భారత్ వద్ద ఉనన్న ఈ బ్రహ్మోస్ క్షిపణికి మన శత్రుదేశాలైన చైనా, పాకిస్తాన్ వద్ద సమాధానమే లేదు. బ్రహ్మోస్ అద్భుతమైన వేగం, ధ్వని కంటే మూడు రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. ఈ వేగం కారణంగా శత్రుదేశాలు ఈ క్షిపణిని అంత ఈజీగా గుర్తించలేదు. క్షిపణి గాలిలో ఉండగానే తన విమాన మార్గాన్ని సర్దుబాటు చేసుకోగలదు. లాంచ్ చేసిన తర్వాత తన దిశ మార్గాన్ని సర్దుబాటు చేసుకోగలదు. శత్రువుల టార్గెట్లపై ఖచ్చితంగా దాడి చేయగలదు. బ్రహ్మోస్ క్షిపణికి ‘‘ఫైర్ అండ్ ఫర్గెట్’’ ఫీచర్‌ని కలిగి ఉంది. ఇది ప్రయోగించిన తర్వాత ఎలాంటి తదుపరి మార్గదర్శకత్వం లేకుండా స్వయంప్రతిపత్తితో దాని లక్ష్యాన్ని గుర్తించి నాశనం చేయగలదు.