AP and TG CSs Meeting: ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ మంగళగిరిలో సమావేశమై పలు కీలక విషయాలపై చర్చలు జరిపారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక విభాగాలకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు పాల్గొని సుమారు రెండు గంటల పాటు చర్చించారు. పెండింగ్ లో ఉన్న అంశాలపై ఎలా ముందుకు వెళ్లాలో చర్చించారు. పలు అంశాలు ఏటూ తేలక పోవడంతో మరోమారు సమావేశం కావాలని నిర్ణయించి భేటీని ముగించారు. అయితే, తెలుగు రాష్ట్రాల విభజన అంశంపై మరో ముందడుగు పడింది. ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు భేటీ అయ్యారు. పునర్వవస్థీకరణ చట్టంలోని అంశాలపై తొలిసారిగా చర్చించారు. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ జరిగింది.
Read Also: Mamata Banerjee: వక్ఫ్ బిల్లు పేరిట ముస్లింలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
ఏపీ – తెలంగాణ సీఎస్ల నేతృత్వంలో అధికారుల కమిటీ సమావేశం జరిగింది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూలు సంస్థల ఆస్తుల పంపకాలపై సీఎస్ల కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది. విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడి, వృత్తి పన్ను పంపకంపై రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ చర్చించినట్లు సమాచారం. మొత్తంగా ఈ భేటీ దాదాపు 2 గంటలపాటు జరిగింది. అయితే, విద్యుత్ బకాయిల అంశంపై అధికారుల చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని సమాచారం. మూడు అంశాలపై ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. రూ. 861 కోట్ల మేర లేబర్ సెస్‌ను ఏపీ, తెలంగాణ మధ్య పెంపకానికి అంగీకరించారు. పన్నులు పంపకాలపై ఇరు రాష్ట్రాల శాఖల అధికారులు సమావేశమై పంపకాలపై ఓ నిర్ణయానికి రావాలనీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read Also: Maharashtra CM Post: సీఎం అభ్యర్థి పేరు ప్రకటన మళ్లీ వాయిదా? ఎందుకో..!
ఎక్సైజ్ శాఖకు సంబధించి ఏపీకి అధికంగా చెల్లించిన రూ .81 కోట్ల బకాయిల అంశం పరిష్కారం అయింది. వాటిని తిరిగి చెల్లించినట్లు ఏపీ అధికారులు తెలిపారు. 9, 10 షెడ్యూలు సంస్థల ఆస్తులు, అప్పులు పంపకాల విషయంలోనూ క్లారిటీ రాలేదు. ఉద్యోగుల మార్పిడి పైనా సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. డ్రగ్స్ రవాణాపై రెండు రాష్ట్రాల పోలీసు, ఎక్సైజ్ శాఖ లతో జాయింట్ కమిటీ వేయాలని రెండు రాష్ట్రాల సీఎస్‌లు ఓ నిర్ణయానికి వచ్చారు. మరోమారు విభజన అంశాలపై సమావేశం కావాలని ఏపీ, తెలంగాణ సీఎస్‌లు సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి తెలంగాణా నుంచి సీఎస్ శాంతి కుమారి, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తాలు, ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్ రావు ఈ సమావేశానికి హాజరు అయ్యారు. ఏపీ నుంచి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ , ఆర్ధిక శాఖ కార్యదర్శి జానకి, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఏపీ జెన్కో సీఎండి చక్రధర్ బాబు, వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు ఏ హాజరయ్యారు..