రూ.52 కోట్ల విలువైన అరటిపండు ఆర్ట్‌వర్క్‌ను వేలానికి పెట్టినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఇంత ఖరీదైన ఆర్ట్‌వర్క్‌ని కొనుగోలు చేసిన వ్యక్తి దానిని డెకరేషన్ కోసం ఎక్కడో ఉపయోగించారని మీరు అనుకుంటూ ఉండవచ్చు. అయితే దాన్ని కొన్న వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. చైనాకు చెందిన క్రిప్టోకరెన్సీ వ్యాపారి జస్టిన్ సన్ ఈ కళాకృతిని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. హాంకాంగ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జస్టిన్ సన్ ఈ బనానా టేప్‌ని తొలగించి గుటుక్కున మింగేశాడు.
READ MORE: Filmfare OTT Awards 2024: ఫిలింఫేర్ 2024 ఓటీటీ అవార్డ్స్ విజేతల లిస్ట్ ఇదే
ఇటీవల.. ఆ అరటిపండు ఓ ప్రముఖ కళాకారుడు తీర్చిదిద్దాడు. కేవలం గోడకు అరటి పండును ఉంచి దానిపై టేపు అతికించారు. ఈ డక్ట్‌టేప్డ్ బనానాను న్యూయార్క్‌లో సోథ్‌బే సంస్థ నిర్వహించిన వేలంలో ఉంచారు. అరటి పండు కళాఖండాన్ని వేలంలో 52 కోట్ల రూపాయలకు క్రిప్టోకరెన్సీ వ్యవస్థాపకుడు జస్టిన్ సన్ దక్కించుకున్నారు. వేలంలో భారీ ధర దక్కించుకోవడం వల్ల డక్ట్ టేపుడ్ బనానా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ కళాకృతిని దక్కించుకున్న అరటి పండును జస్టిన్ సన్ తినేశాడు. జస్టిన్ సన్ ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నాడు. ఈ అరటిపండు రుచి ఇతర పండ్ల కంటే భిన్నంగా ఉందని తెలిపాడు. ఈ వీడియోను చాలా మంది వీక్షించారు. అదే సమయంలో దీనిపై పలువురు వ్యాఖ్యానించారు.
READ MORE:Telangana Honour Killing: తెలంగాణలో మరో పరువు హత్య.. లేడీ కానిస్టేబుల్ను నరికి చంపిన తమ్ముడు
🍌 BREAKING: Justin Sun eats the $6.2M banana art he purchased. pic.twitter.com/3Qj1ANpTYX
— Cointelegraph (@Cointelegraph) November 29, 2024